మొన్న అంబానీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు.. ఆ అతిథుల వెల్లువ చూస్తే.. మతిపోయింది.
మహామహానటులు.. షూటింగులు లేవు.. కాల్షీట్లతో పని లేదు.. అసలు బాలీవుడ్ నటులు సరైన సమయానికి షూటింగుకు రారని ప్రతీతి.. అందులో పెద్ద పెద్ద హీరోలు ఇతర నటుల కాంబినేషన్ ఉన్న సన్నివేశాలైతే నిర్మాతకు నరకమే..ఒకటే కామన్.. అక్కడా నటనే..ఇక్కడా నటనే.. సొంతింట్లో మాదిరి అన్నిట్లో హుషారుగా పాల్గొన్నారు.నాకు తెలిసి అమితాబ్ ఒక్కరే ముందు నుంచి అంబానీ కుటుంబానికి మంచి స్నేహితుడు అది కూడా అనిల్ అంబానీకి..!
ఇక టెండూల్కర్ తో సహా దిగ్గజ క్రికెటర్లు.. టాస్ అక్కర్లేదు.. ఎవరు ముందు బ్యాటింగో.. ఎవరి బౌలింగో..ఆ క్రమమే లేదు..క్రీజ్ లోకి క్రేజీగా వచ్చేసారు.అర్థరాత్రి అయ్యే పాటికి చాలా”మందు” ఔట్ అయిపోయేవారట..!
పారిశ్రామికవేత్తలు..ఇతర రంగాల ప్రముఖులు.. సన్యాసులు..రాజగురువులు ఎందరెందరో అంబానీ ఇంట్లోని వివాహ వేడుకలో కొలువు దీరారు..!
అందర్లోకి వీవీఐపీ.. సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు.. అంబానీ ఇంట పెళ్ళిలో ఎంతసేపు గడిపారో..
డాన్సులు.. మెహందీలు.. హల్దీలు..పెళ్లి..రిసెప్షన్… ఇలా అన్ని వేడుకల్లో వీఐపీ అతిథులు హుషారుగా పాల్గొన్నారు. బహుమతులు అటూ ఇటూ భారీగా చేతులు మారాయి.
ఇదంతా అవసరమా.. మీడియా కూడా ఆ నాలుగు రోజులూ ఇంకేమీ అంశాలు లేనట్టు గొప్పింటి పెళ్లి వేడుకను అదే పనిగా చూపించిందే చూపించి హడావిడి చేసింది.
కొన్ని కుటుంబాలు ఏళ్ల తరబడి జీవితాన్ని వెళ్ళబుచ్చేంత డబ్బు ఖర్చయింది అంబానీ ఇంట పెళ్లి వేడుకకు.. ఆయన సొమ్ము..ఆయనిష్టం.. అనుకోవచ్చు..
కానీ వివాహాలు..ఇతర వేడుకల పేరిట ఇంత డబ్బు ఖర్చు చెయ్యడం.. తగదని చెప్పాల్సిన పెద్దలు హాజరై ముచ్చట్లు చెప్పుకుంటూ చప్పట్లు కొట్టడం.. ఇబ్బందిగా అనిపించింది కదా..!