ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా, కేవలం జీతభత్యాల కోసం దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకపై ఇలాంటి అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని ఆమె వెల్లడించారు.
‘ఆ సైకోను ఎవరూ గట్టిగా అడగలేదు’: అసెంబ్లీలో జగన్పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి వ్యవహారంపై ఘాటు చర్చ
“మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది బాలకృష్ణే: జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు”
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాధవి రెడ్డి, వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు రావడానికి మనసు రాని వారు, జీతాలు తీసుకోవడానికి మాత్రం రహస్య మార్గాలను ఎంచుకోవడం వారి నైతికతకు నిదర్శనమని ఆమె విమర్శించారు.
సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ సభ్యులు సభను బహిష్కరిస్తున్నప్పటికీ, హాజరు పట్టికలో మాత్రం వారి సంతకాలు ఉంటున్నాయని ఆమె ఆరోపించారు. తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న బాధ్యతను విస్మరించి, కేవలం దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను వంచించడమేనని ఆమె మండిపడ్డారు.

