అదృష్టవంతుడు నారా దేవాన్ష్

తెలుగు రాష్ట్రాల్లో నారా దేవాన్ష్ అంతటి దృష్టవంతుడు ఎవరూ ఉండరేమో! పుట్టక ముందే, పేరుకూడా పెట్టక ముందే ఆయన కోటీశ్వరుడు. నిండా ఆరేళ్ళ వయసులేని ఆ పసివాడు తన వయస్సుకు మూడురెట్ల ధనవంతుడు. అప్పట్లోనే నారా లోకేష్ అదృష్టవంతుడు అనుకున్నాం. ఎక్కడో నారావారిపల్లెలో వ్యవసాయం చేస్తూ దాచిన డబ్బులతో హైదరాబాద్ శివార్లలోని మదీనాగూడలో ఐదెకరాల భూమి కొని బహుమతిగా ఇచ్చింది. లోకేష్ చెప్పిన లెక్కప్రకారం చూస్తేనే రెండుకోట్ల 22 లక్షల విలువచేసే భూమి అది. వ్యవసాయ కూలి పని చేసే నారా అమ్మణ్ణమ్మ తన మనవడికి రెండు కోట్ల విలువైన ఆస్తి బహుమతిగా ఇస్తే ఇక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, తెలుగు చిత్రపరిశ్రమను ఏలుతున్న నందమూరి బాలకృష్ణ వారి మనవడికి ఎంత ఆస్తి ఇవ్వగలుగుతారో ఉహించలేమా? అందుకే దేవాన్ష్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అదృష్ట వంతుడైన మనవడు.

ఒక తాత రాష్ట్రాన్నేలితే, ఇంకో తాత చిత్రపరిశ్రమను ఏలుతున్నారు. తండ్రి త్వరలో రాష్ట్రాన్నేలనున్నారు. ఇలాంటి నేపధ్యం ఉన్న దేవాన్ష్ అదృష్టవంతుడు కాకపొతే మామూలు మనవళ్ళు అదృష్టవంతులు అవుతారా? ఇందులో ఆ పసివాడి ప్రమేయం ఏమీ లేకున్నా, తాత, తండ్రి రాజకీయాల కారణంగా ప్రజల్లో ఇప్పుడు దేవాన్ష్ కూడా ఒక చర్చనీయ వ్యక్తే. దేవాన్ష్ ఆస్తులు కూడా చర్చనీయమే. చర్చకు పెట్టింది వారే కనుక, పసివాడిపై ఈ చర్చేంటి అనే హక్కు వారికీ లేదు, వేరెవరికీ లేదు. యేటా చేస్తున్న హాస్యభరిత ఆస్తుల ప్రకటనను ఈ యేడాది కూడా చేశారు నారా వంశీయులు. పైగా అదేదో ఘనకార్యం అన్నట్టు డప్పులు కొట్టుకుంటున్నారు. గత తొమ్మిదేళ్ళుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినోదం కలిగిస్తూ, ఆర్థికశాస్త్రం అణుమాత్రం కూడా తెలియనవసరం లేని జనానికి కూడా నవ్వొచ్చే ప్రకటనలు మొదట్లో చంద్రబాబు, గత నాలుగేళ్ళనుండి లోకేష్ అందిస్తున్నారు.

గత యేడాదితో పోల్చితే ఈ యేడాది చంద్రబాబు ఆస్తులు, లోకేష్ ఆస్తులు కొంత పెరిగాయి. అయితే వారు “సామాజిక సేవ” రంగంలో ఉన్న కారణంగా ఎదో షేర్ మార్కెట్ ద్వారా పెరిగే ఆదాయం తప్ప ఇతర వనరులేం లేవు. కుటుంబంలో ఉన్న ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు కష్టపడి పాలు, కూరగాయలు అమ్ముతుంటే అలా బ్రతికేస్తున్నారు. 1992లో చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ప్రారంభించిన హెరిటేజ్ పాల వ్యాపారమే కుటుంబానికి ఇప్పుడు ఆసరాగా నిలిచింది. సంపాదించి కుటుంబాన్ని పోషించవలసి మగవాళ్ళిద్దరూ ప్రజాసేవలో తరిస్తుంటే ఆడవాళ్ళిద్దరూ కష్టపడి కుటుంబానికి ఆదాయం సమకూర్చుతున్నారు. ఇదీ నారా వారి కుటుంబ ఆదాయ లెక్కలు. వారి ఆదాయ రహస్యాలు. అన్నిటికీ మించి బ్యాంకు ఆఫ్ బరోడా లో తనఖా పెట్టి హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో నిర్మించుకున్న ఇల్లు, నారావారి పల్లెలో వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు మినహా చెప్పుకోదగ్గ ఆస్తులేమీ లేని పేద కుటుంబంలో ఆరేళ్ళ వయసు పిల్లాడైన దేవాన్ష్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలందరికంటే అదృష్టువంతుడిగా!?

`భీష్మ` రివ్యూ : లాఫింగ్ ఫ‌న్ రైడ్‌

Written by Aditya for TeluguRajyam.com