పార్లమెంట్ సభ్యుడిగా ప్రకాష్ రాజ్ పోటీ ?

నటుడు ప్రకాష్ రాజ్ టి ఆర్ ఎస్  పార్టీ నుంచి లోక సభకు పోటీచేయబోతున్నారా ? ప్రకాష్ రాజ్ కేసీఆర్ తో సన్నిహితంగా వుండతో ఈ వార్తకు బలం చేకూరుస్తుంది . కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ప్రకాష్ రాజ్ తనవంతు సహకారం అందిస్తున్నాడు .

గతంలో కేసీఆర్ తో పాటు బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవీ గౌడ తో చర్చలు జారీపై వచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా  ప్రకాష్ రాజ్ కేటీఆర్ కలసి మాట్లాడటం ఇందుకు మరింత బలం చేకూరుస్తుంది . ప్రధాని నరేంద్ర మోడీ మీద వాడిగా వేడిగా విమర్శలు గుప్పిస్తున్నారు . మోడీని దించేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు .

ప్రకాష్ రాజ్ సినిమాలు తగ్గించుకొని రాజకీయాలపై ఎక్కువ ద్రుష్టి పెడుతున్నట్టు అనిపిస్తుంది . మహబూజ్ నగర్ జిల్లా కేశం పేట మండలం లోని కొండారెడ్డి పల్లెను దత్తత తీసుకున్నాడు . ఆ గ్రామంలోనే  ప్రకాష్ రాజ్ కుటుంబంతో నివసిస్తున్నాడు .

ప్రకాష్రాజ్ ఇప్పుడు తెలంగాణ వాసి అయ్యాడు . అందుకే ఇక్కడ నుంచే ఆయన పార్లమెంటుకు పోటీచేస్తాడని అంటున్నారు . ఇందుకు కేసీఆర్ కూడా సానుకూలంగా వున్నదని తెలుస్తుంది . ప్రకాష్ రాజ్ కేసీఆర్కు వెన్ను దన్నుగా ఢిల్లీలో వెండి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది .