ఓవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై సీబీఐ విచరాణకు రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో తలపెట్టిన పథకాలపై భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు జగన్ ప్రభుత్వం కూపీ లాగడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక చంద్రబాబుకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లేనని ఓవైపు సోషల్ మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కంటే ముందుగానే ఆపార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అడ్డంగా బుక్కయ్యారు.
ఈఎస్ఐ కుంభకోణంలో చంద్రబాబు హయాంలో అప్పుడు కార్మిక మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుని ఈ రోజు తెల్లవారు జామున ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి అచ్చెనాయుడు భారీ కుంభ కోణానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ బయట పెట్టింది. ఈ కుంభ కోణంలో చంద్రబాబుకి రైట్ హ్యాండ్ గా అచ్చెన్నాయుడు ఉన్నట్లు సమాచారం. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని నివేదికలో ఉంది.
టెలీ హెల్తీ సర్వీసుల పేరుతో ఆర్డర్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ పద్దతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించినట్లు విచారణలో వెలుగు చూసింది. ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభ కోణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకున్ని ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారలు గుర్తించారు. ఈమొత్తం వ్యవహారంలో ఈఎస్ ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అచ్చెన్నాయుడు నేటి ఉదయం నుంచి అన్ని రాజకీయ పార్టీల్లో చర్చాంశనీయంగా నిలిచారు.