రాధాకృష్ణ టార్గెట్ వైసిపి 

abn radhakrishna targets ysrcp
మన పత్రికలు పెట్టుబడులకు, కట్టుకథలకు  పుట్టిన విషపుత్రికలు అని మహాకవి  శ్రీశ్రీ డెబ్బై ఏళ్ళక్రితం చెప్పిన మాటలు ఈనాటికీ పరమ సత్యం అని రుజువవుతున్నాయి.  ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి క్షుద్రపత్రికలను  చూస్తుంటే, వారి  అక్కసు, తమ స్వార్ధప్రయోజనాలకోసం సత్యాన్ని ఎంత   లోతుకైనా పాతిపెట్టడానికి బరితెగింపు  స్పష్టంగా కనిపిస్తాయి.  తన యజమాని నుంచి  దోపిడీ  సొమ్ములో  వాటాలు  గత  ఏడాదిన్నరగా  అందకపోతుండమే  కాక, కరువులో అధికమాసం అన్నట్లు కరోనా కూడా ఆదాయాన్ని దెబ్బ తియ్యడంతో శ్లేష్మంలో పడిన ఈగలా, సాలెపట్టులో చిక్కుకున్న దోమలా ఉక్కిరిబిక్కిరైపోతూ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్న రాధాకృష్ణ యధాప్రకారం తన దేహంలో నిలువెల్లా మరిగిపోతున్న విషాన్ని వాంతులు చేసుకున్నాడు! 
  
abn radhakrishna targets ysrcp
abn radhakrishna targets ysrcp
“”””తిరుపతిలో తెలుగుదేశం పార్టీని తృతీయస్థానంలోకి నెట్టడానికై రూపొందించిన వ్యూహంలో భాగంగా అధికార వైసీపీ సహకారం తీసుకోబోతున్నామని బీజేపీ ముఖ్యుడొకరు చెప్పుకొచ్చారు.”””
 
అదేమిటో మహాత్మ్యం తెలియదు కానీ కేసీఆర్, జగన్, మోడీ, అమిత్ షా, చంద్రబాబు, మమతాబెనర్జీ, పళనిస్వామి, నితీశ్కుమార్ లాంటి హేమాహీమీలు రహస్యంగా జరుపుకునే  చర్చలు, వ్యూహప్రతివ్యూహాలు ఏమిటో రాధాకృష్ణకు వెంటనే తెలిసిపోతుంటాయి.    రాధాకృష్ణకున్న వేగుల వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది.   తమ వ్యూహం ఏమిటో బీజేపీ నాయకులు అర్ధరాత్రి వేళ రాధాకృష్ణ పడకగదిలో ప్రవేశించి  కర్ణపుటాల్లో ఊదిన ఆ పిశాచులు ఎవరో మరి??
 
 
 
“””ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని కలిసినప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే క్రమంలో తన సహకారం ఉంటుందని జగన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా కమలనాథులు చెబుతున్నారు.”””
 
 
వావ్!   తెలుగుదేశాన్ని బలహీనపరచాలంటే అందుకు సహకారాన్ని జగన్ అందించాలన్న మాట!     నలభై ఏళ్ల అనుభవం కలిగిన పార్టీ…నిన్నగాక మొన్న వచ్చిన యువకుడి చేతిలో బలహీనమై నశించబోతున్నదన్న మాట!  జగన్ రెడ్డి అలా ఎవరికీ హామీ ఇచ్చారో, ఆ కమలబాంధవులు ఎవరని మనం అడగరాదు!  ఎందుకంటే వారెవ్వరూ మన కళ్ళకు కనిపించరు ఒక్క రాధాకృష్ణ కలల్లో తప్ప! 
 
 
“””తిరుపతిలో బీజేపీ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఉపఎన్నికలో బీజేపీకి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అంగీకరించినట్లు చెబుతున్నారు. 
 
వాహ్వా….ఆకాశానికి అంతుందేమో కానీ రాధాకృష్ణ నిరాశానిస్పృహలకు అంతే లేదు.  ఉపఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి చేసే ఆర్ధికసాయాన్ని అందించే దుస్థితిలో   ఉన్నదా బీజేపీ?  ఏడేళ్లనుంచి అప్రతిహతంగా అధికారంలో ఉంటూ, దేశంలోనే అత్యధిక విరాళాలు అందుకుంటూ, అత్యంత ధనికపార్టీగా పేరొందిన బీజేపీకి ఆఫ్టరాల్ ఒక ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డి సాయం అందుకునే దీనస్థితిలో ఉన్నదా!!!  నవ్వుతారన్న సిగ్గు లజ్జా కూడా లేవే  మన రాధాకృష్ణకు!  చంద్రబాబు ఇచ్చే పాకేజీలు అందుకోవడానికి అదేమైనా కమ్యూనిస్ట్, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లాంటిదా రాధాకృష్ణ గారూ?  
 
 
“””రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఉన్నపళంగా తృతీయస్థానంలోకి నెట్టడం ఆషామాషీ కాదు. బీజేపీ నుంచి కవ్వింపులు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంలో భాగంగా మౌనంగా ఉంటున్నారు.”””
 
పాపం!  చంద్రబాబుకు పట్టిన గతి పగవాడికి కూడా వద్దు బాబోయ్!  మొన్నటి ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా, రాష్ట్రానికి రావడానికి కూడా వీల్లేదని హోర్డింగులు పెట్టి,  పార్టీ అధ్యక్షుడు తిరుపతి వస్తే రాళ్లతో కొట్టి భయభ్రాంతులను చేసి, మోడీ వ్యక్తిగత జీవితం మీద కూడా కుత్సిత విమర్శలు చేసిన చంద్రబాబు…రెండోసారి మోడీ గెలవగానే ఉండేలు దెబ్బతిన్న కాకిలా, గజగజ వణికిపోతూ, గత ఏడాదిన్నరగా చేస్తున్న మోడీ భజనను ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నది.  చివరకు మోడీ బాత్ రూమ్ కు వెళ్లినా, మోడీ నడక నెమలి నడకలా ఉన్నదని కవిత్వాలు వల్లిస్తూ మోడీ దయాదాక్షిణ్యాలకోసం బానిసలా పడిఉన్న చంద్రబాబు మౌనంగా ఉంటున్నది ఎందుకో రాధాకృష్ణకు తెలుసు.  నోరు మెదిపితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం అని బీజేపీ నాయకులు సైతం నవ్వుతూ చెప్పుకుంటున్నారు.  గల్లీ స్థాయి నాయకుడు నోరు పారేసుకున్న చంద్రబాబు కుక్కిన పేనులా పడిఉంటున్న చోద్యం చూసి జనం గమనిస్తున్నారులే రాధాకృష్ణా! 
 
 
 
‘””అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అష్టదిగ్బంధనం చేశాం. ఇప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. అందువల్ల ఆయన్ని కట్టడి చేయడం చిటికెలో పని’ అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.”””
 
వారు అష్టదిగ్బంధనం చేశారు సరే…చంద్రబాబు గారు ఎందుకు చేయించుకున్నారు?  అష్ట దిగ్బంధనం అంటే ఏమిటి?  చంద్రబాబు తాను దోచిన వేలకోట్ల రూపాయల ప్రజాధనముతో ఓట్లు కొనకుండా కట్టడి చేశారు.  ఫలితంగా చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు.  దీన్నిబట్టి అర్ధం అయ్యేది ఏమిటి?  చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ఓట్లను కొనుగోలు చేసే గెలిచాడు తప్ప ప్రజాబలంతో కానేకాదు అని అర్ధమైపొలా?  
 
 
 
“””ఇక ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుచేతల్లో ఉంది. కేంద్రంలో మేము ఉన్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒంటరి కాకుండా ఎలా తప్పించుకోగలరు? తిరుపతిలో తెలుగుదేశం పార్టీని అడుగడుగునా అడ్డుకుంటాం”””
 
ఏ రాష్ట్రంలో అయినా పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి చేతుల్లో కాక ప్రతిపక్ష నాయకుడి చేతుల్లో ఉంటుందా?  చంద్రబాబు పాలిస్తున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఏమైనా జగన్ చేతుల్లో ఉన్నదా?  సిల్లీ పాయింట్ కాకపొతే!  
 
 
“””రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు రాజధాని అమరావతిని తరలించకుండా బీజేపీ అడ్డుకోవడం లేదని, పోలవరం ప్రాజెక్టుకు కూడా సహకరించడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ ఉన్నపళంగా బలహీనపడిపోయి బీజేపీ బలం పెంచుకునే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు”””
 
రాష్ట్రం విభజించబడిన తరువాత మొదటి అవకాశం చంద్రబాబుకు దక్కింది.  ఆ సమయంలో ఏమి జరిగింది?  హోదా తీసుకుని రావాల్సిన బాధ్యత చంద్రబాబు మీద పడింది.  మరి ఆయన ఎందుకు తీసుకుని రాలేదు?  పైగా ప్యాకేజి ఇస్తామంటే ఎందుకు  అంగీకరించారు చంద్రబాబు?  పాకేజీలో అయితే వేలకోట్ల రూపాయలు దోచుకోవచ్చనే కదా?  ఇక పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం మీద ఉంటే, వారినుంచి ఆ ప్రాజెక్టును గుంజుకుని రాయపాటికి ఎందుకు కట్టబెట్టారు?  ఇప్పుడు రాయపాటి తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టారని ప్రకటించారు.  పోలవరం బాధ్యతను కేంద్రం పైనే ఉంచినట్లయితే నిర్మించకపోతే ఆ అపఖ్యాతి కేంద్రం ఖాతాలో పడేది కదా?  హోదా అంటే జైలుకే అని హెచ్చరికలు చేసింది జగనా లేక చంద్రబాబా?  హోదాను పాతేసింది చంద్రబాబే అని అందరికీ తెలుసు కదా?  అటు హోదాను తేలేక, ఇటు ప్యాకేజీ తేలేక అసమర్ధుడుగా చంద్రబాబు ఐదేళ్లలో నిరూపించుకున్నారు.  ఆ విషయాన్ని వదిలేసి ఇతరుల మీద పడి ఏడవటం రాధాకృష్ణకు మాత్రమే చెల్లింది.  
 
“””హోదా విషయమై ప్రజల్లో సెంటిమెంట్‌ అలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టింది. రాష్ట్రంలో తమ రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందని భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే వైఖరితో ఉంటుందనుకోలేం. “””
 
ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నదని చెబుతూనే తెలుగుదేశం ఆ అంశాన్ని పక్కన పెట్టింది అని మూలుగుతున్నారు రాధాకృష్ణ.  రాష్ట్రంలో తన ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని భావిస్తేనే మళ్ళీ పోరాటం మొదలుపెడుతుందన్నమాట!   తన ఉనికి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి హోదా అవసరం లేదు…పోలవరం అవసరం లేదు.  అంతేగా రాధాకృష్ణా! 
 
 
“”బీజేపీ విషయంలో మౌనంగా ఉంటున్నప్పటికీ ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీకి పూర్వ సంబంధాలు నెలకొనే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. బీజేపీ నుంచి కవ్వింపులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నారు.”””
 
హమ్మయ్య…ఇప్పటికి రాధాకృష్ణకు తత్త్వం బోధపడింది.  మోడీకి ఎంత భజన చేసినా, కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, సాగిలపడినా, సాష్టాంగపడినా ఆయన కరుణించి తన యజమానికి అభయహస్తాన్ని అందించే అవకాశం లేదని ఇన్నాళ్లకు అర్ధం అయినందుకు సంతోషిద్దాం.  
 
 
“””అయితే, బీజేపీ వల్ల తమ రాజకీయ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తే తమ వద్ద ఉన్న రాజకీయ అస్ర్తాలను బయటకు తీస్తామని టీడీపీకి చెందిన మరో నాయకుడు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము భావించడం లేదని, అలాంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలను తెర మీదకు తెస్తామని ఆయన వివరించారు.”” 
 
సెబాస్…అర్ధమయింది కదా ఆంధ్రసోదరసోదరీమణులారా!  బీజేపీ వలన తమ కొంప గుండం అవుతుందని భావించిననాడే తెలుగుదేశం ప్రత్యేక హోదా, పోలవరం లాంటి అస్త్రాలను బయటకు తీస్తుంది.  అంతే తప్ప ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి వారికి అవసరం లేదు!  
 
 
 
 
“””నిజానికి రాజకీయ పార్టీల బలాబలాలు తెలియడానికి ఉపఎన్నికలు ప్రామాణికాలు కావు. గతంలో నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ దాదాపు 30 వేల మెజార్టీతో గెలిచింది. సాధారణ ఎన్నికల్లో అదే స్థానాన్ని 30 వేలకు పైగా మార్జిన్‌తో కోల్పోయింది. అధికారంలో ఉన్న పార్టీకి ఉపఎన్నికలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. తిరుపతిలో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది.”””
 
అవును మరి…అప్పట్లో శ్రీవారు ఓటుకు అయిదువేలనుంచి పాతికవేలు సమర్పించి, సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల పనులు ఆదరాబాదరాగా చేసి, ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయడంతో తెలుగుదేశం గెలిచింది.  లేకపోతే ఆ ఉపఎన్నికలో తెలుగుదేశం దారుణంగా ఓడిపోయేది.  సాధారణ ఎన్నికల్లో ఆ ట్రిక్కులు పనిచేయలేదు.  దాంతో తెలుగుదేశం వాస్తవబలం ఏమిటో బయటపడింది.  
 
 
 
“”””ఈ విషయం అలా ఉంచితే రాజధానిలో పేదలు, ఇతర కులాల వారు ఉండకూడదనుకుంటే ఎలా? అని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. అమరావతిలో ఒకే కులం వారు ఉన్నారని, ప్రజలను ముఖ్యంగా పేదలను నమ్మించడానికే ఆయన ఈ వాదనను మొదలుపెట్టి ఉంటారు.”””
 
హదేమిటి?  పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే అక్కడ కులసమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లడం, కోర్ట్ స్టే ఇవ్వడం నిజం కాదా?  
 
 
‘””నిజం చెప్పులు వేసుకుని బయల్దేరే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంద’న్న సామెత ఉండనే ఉంది. అమరావతి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న అవాస్తవాల ప్రచారంతో నిజాలు సమాధి అయిపోతున్నాయి. ఫలితంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పోరాటాన్ని వారి సమస్యగానే మిగతా ప్రాంతాల ప్రజలు చూస్తున్నారు””” 
 
అవును మరి!   ఐదేళ్లు అధికారం చేతిలో ఉన్నప్పటికీ ఒక్క నిర్మాణం కూడా చెయ్యకుండా వందిమాగధులను వెంటేసుకుని ప్రత్యేకవిమానాల్లో జల్సా పర్యటలను చేసి, అమరావతి ఒక సింగపూర్, ఒక జపాన్, ఒక బ్రిటన్, ఒక పారిస్ కాబోతున్నదంటూ  తన క్షుద్ర మీడియాతో డప్పు వేయించుకుని, రోడ్ల పక్కన కాఫీ, మిర్చిబజ్జీలు, చెప్పులు అమ్ముకునేవారికి పారిశ్రామికవేత్తల బిల్డప్పులు ఇచ్చి, లక్షలకోట్ల రూపాయలు పెట్టుబడుల్లో వస్తున్నాయని ప్రజలను మోసంచేసి వాస్తవాలను సమాధి చేసిన చంద్రబాబును తమ స్వార్ధం కోసం ఆకాశానికెత్తే రాధాకృష్ణ, రామోజీరావులాంటి నికృష్ట జర్నలిస్టులు ఉన్నంతకాలం నిజాలు సమాధి అయిపోతూనే ఉంటాయి.   అమరావతి రైతుల ఉద్యమం అంటూ డ్రామాలు నడిపిస్తూ, కోట్ల రూపాయలు కొల్లగొట్టే తమ వ్యూహం తల్లకిందులు అయిందనే ఆక్రోశంతో రైతుల వేషాలు వేసుకుని షామియానాలో కూర్చుని కాసేపు కేకలు పెట్టి ఇంటికి వెళ్లిపోయేవారికి ఇతర ప్రాంతాల మద్దతు ఎలా లభిస్తుంది?  ఏడాది కాలంగా క్షుద్రపచ్చమీడియా ఎంత గిజగిజలాడుతున్నా ఆ ఉద్యమానికి పక్క జిల్లా నుంచి కూడా మద్దతు దొరకడంలేదంటేనే ఆ ఉద్యమం తెలుగుదేశం దొంగలు ఆడిస్తున్న కపటనాటకం అని ఈజీగా అర్ధం అవుతుంది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు