కరుణానిధి: అబ్బుర పరిచే కొన్నిసత్యాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డిఎంకె పెద్దాయన ఎం కరుణానిధి భారత దేశ రాజకీయాలలో ఒక అగ్రశ్రేణి నాయకుడు. తమిళరాజకీయాలను కాంగ్రెస్ హస్తగతం కాకుండా కాపాడి,ప్రాంతీయ గౌరవాన్నినిలబెట్టిన వాళ్లలో ఒకరు. ఆయన గొప్ప మేధావి, పండితుడు, రచయిత.  ఆయన గురించిన కొన్ని ఆసక్తికరమయిన విషయాలు: 

1 కరుణానిధి   తెలుగు వాడు. ఆయన మాతృభాష తెలుగు. అందుకే ఆయనను పరాయి అని ప్రత్యర్థులు విమర్శిసుండేవారు.ఆయన పేరు  ముత్తువేల్ దక్షిణా మూర్తి. సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చారు.

 

2. స్క్రీన్ ప్లే  రైటర్ గా తమిళ సినిమా పరిశ్రమలో కాలుపెట్టారు.

3. ఆయనకు కళైనార్ అని బిరుదు ఇచ్చింది ప్రఖ్యాతనటుడు ఎంఆర్ రాధ. కరుణానిధి రాసిన నాటకం ‘థూక్కు మీదై’ చూసిన తర్వాత ప్రశంసిస్తూ ఆయనను కళైనార్ (పండితుడు) అని పలిచారు.

4. కరుణానిధి మొదటి కథ రాసింది ఎంజిఆర్ చిత్రానికి. చిత్రంపేరు రాజకుమారి (1947). ఆయన చివరి చిత్రంప్రశాంత్ నటించిన  ‘పొన్నార్ శంకర్’ (2011)

 

5. 2016 లో ఆయన రామానుజార్ సీరియల్ కు సంభాషణలు రాశారు.

 

6. తమిళ సినీరంగంలో మహాకావ్యాలుగా పేరువడిన ఎన్నో చిత్రాలకు ఆయన స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఎంజిఆర్ మంత్రికుమారి,మలైక్కాలన్, శివాజీ గణేశన్ ప్రశాంతి, మనోహర ఆయన రాసిన  స్క్రీన్ ప్లే లే. 

 

7. తమిళ సినిమా రంగంతో ఆయనకు 64 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ కాలంలో 69 చిత్రాలకు స్ర్కీన్ ప్లే సమకూర్చారు.

8. కరుణానిధి విపరీత చదువరి. ఆయన ఇంటి గ్రంధాలయంలో దాదాపు పదివేల పుస్తకాలున్నాయి

 

9. మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యారాయ్ , తాబు నటించిన మణిరత్నం చిత్రం ‘ఇరువార్’  కథకు ఆధారం కరుణానిధి, ఎంజి ఆర్ ల మధ్య ఉన్న సంబంధాలే.

10. తన 33 వ యేట, 1957 లో ఆయన తమిళనాడు అసెంబ్లీకి ఇండిపెండెంటు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

11.డిఎంకె అధ్యక్షుడిగా 50 యేళ్లున్నారు.

12. పుట్టుకతో ఆయన తెలుగు వాడు. నాటి మదరాసు ప్రెసిడెన్సీ తిరువారూర్ జిల్లా తిరుక్కువళై లో ఆయన జన్మించారు (జూన్ 3, 1924).