వై యస్ భారతి కేసు – ఎవరికేంటి – 2

ఇక  తెలుగు దేశం విషయానికి వద్దాం. ప్రధాన ప్రతిపక్షం వైస్సార్సీపీ మీద టీడీపీ ప్రయోగించే ప్రధాన  అస్త్రం 40 ఏళ్ళ అనుభవం వున్నా నాయకుడు ఒక వైపు లక్ష కోట్ల అవినీతి చేసిన నాయకుడు మరో వైపు. మీకు ఎవరు  కావాలో నిర్ణయించుకోండి అని ప్రజలను అడగటం.

గత ఆరునెలలుగా పాదయాత్రతో దూకుడుగా వెళ్తున్న జగన్ ప్రత్యేక హోదా విషయంలో  చంద్రబాబుని పదే పదే మాట మార్చే విధంగా చేసి పైచెయ్యి సాధించినట్టు కనపడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ సరికొత్త ఈడీ కేసు తెర  పైకి రావడం టీడీపీ కి ఒక అస్త్రం దొరికినట్టే .

ఎవరు అవునన్నా కాదన్న మీడియా మేనేజ్మెంట్ లో టీడీపీకి  ఎవ్వరు సరిరారు . గత రెండు రోజులుగా చాలావరకు అన్ని చానెల్స్ లో  ఇదే సబ్జెక్టు పై చర్చలు నిర్వహించారు . జగన్ ఏదో కొత్త కేసులో ఇరుకున్నాడు అన్నంత రేంజ్ లో తెలుగుదేశం ప్రతినిధులు తమ వాదనను ప్రజలోకి తీసుకువెళ్లగలిగారు . ప్రెస్ మీట్ లు పెట్టి మంత్రులు దేవినేని ఉమా, ఆదినారాయణ రెడ్డి యనమల రామకృష్ణుడు లాంటి వారు జగన్ ఒక్కడే కాకుండా కుటుంబాన్ని కూడా అవినీతిలో ముంచాడు అనే బలమైన వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు.  కొంతమేరకు విజయం సాధించారు కూడా.

ఎటొచ్చి ఈ విషయంలో తెలుగుదేశంకి ఓట్ల రూపంలో ఎమన్నా మేలు జరుగుతుందా అని ఆలోచిస్తే లేదనే చెప్పాలి. జగన్ అవినీతి  పరుడు అనే నమ్మేవాళ్లు ఎలాగూ జగన్ వైరిపక్షంలో వున్నప్పుడు ఆ వైరిపక్షం టీడీపీ అయినప్పుడు ఇంకా అదనంగా టీడీపీకి ఒనగూరే మెలేముంటుంది? కాకపోతే ఫేస్బుక్ లో సెటైర్లు  అవి వేసుకోవడానికి టీడీపీ సోషల్ మీడియా మంచి సరుకు దొరికినట్లయింది.

ఇక పోతే టీడీపీకి ప్రధానంగా జరిగిన నష్టం ఏంటంటే… టీడీపీ చేస్తున్న  వైస్సార్సీపీకి బీజేపీ కి మధ్య రహస్య బంధం వాదన బలహీనపడే అవకాశం వుంది. బీజేపీతో టీడీపీ చేసిన నాలుగేళ్ళ సహవాసాన్ని చంద్ర బాబు గారు చాకచక్యంగా వదిలించుకోవడమే  కాకుండా వారి వైఫల్యాలను తెలివిగా జగన్ మీదకి మళ్లించే క్రమంలో వున్నారు. కొంతమేరకు సఫలం అయ్యారు కూడ. ఎప్పుడైతే కేంద్రం పర్యవేక్షణలో వున్నా సంస్థ నేరుగా జగన్ సతీమణి మీద కేసు పెట్టిందో ఇక చంద్రబాబు గారికి అది పూర్తిగా సాధ్యపడకపోవొచ్చు .

రాజకీయాలలో అనేక అస్త్రాలు అందివచ్చినప్పుడు ఏది అందుకోవాలి ఏది వదిలెయ్యాలి అని రాజకీయ పార్టీలు తెలివిగా  నిర్ణయించుకోవాలి. ఎందుకంటె ఒకేసారి రెండు పరస్పరమైన విరుద్ధ వాదనలు వినిపిస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. జగన్ కేసులు అనేది పాత అంశం. ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్త కోణాలు వెతకావల్సిన అవసరం లేదు. కానీ జగన్ బీజేపీ రహస్య బంధం  అనే వాదనని బలంగా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఈడీ కేసు విషయాన్నీ చాల తేలికగా తీసుకోవాల్సింది టీడీపీ. ఎప్పుడైతే ఈడీ కేసుని ప్రధాన అస్త్రం చేసుకున్నారో, జగన్ బీజేపీ రహస్య బంధం అనే వాదన ఒక పనికిరాని అస్త్రం కింద తయారైనట్టే .

దూరదృష్టితో చూస్తే ఇది కొంచెం వ్యూహాత్మక లోపం లాగ కనిపించినప్పటికీ మీడియా సహకారంతో ఎప్పుడు ఏ వాదాన్ని తగ్గించాలో  దేన్ని పెంచాలో అన్నది తమ చేతిలో పని అని టీడీపీ కాన్ఫిడెన్స్ కూడా కావొచ్చు.

వైస్సార్సీపీ కొంచెం ముందుగా  జాగ్రత్తపడి ఈడీలో వున్నా అధికారులు వాళ్లకు టీడీపీతో వున్నా సంబంధం ప్రజల ముందు పెట్టింది. ఇది కూడా ఒకవిధంగా ఈ కేసు ప్రభావాన్ని ప్రజల్లో తగ్గించడానికి ఊపయోగపడుతుంది. న్యూట్రల్గా వున్నా ప్రజలు ఈ విషయాలన్నీ పక్కపక్కన పెట్టి చూస్తే వైస్సార్సీపీకి బెనిఫిట్ అఫ్ డౌట్ ఇచ్చే అవకాశం వుంది.

ఇక జనసేనకి దాని స్టాండర్డ్ లైన్స్ దానికి వున్నాయి . 40 ఏళ్ళ అనుభవమున్న చంద్రబాబు వైఫల్యం చెందాడు అలాగే జగన్ లక్ష కోట్లు అవినీతుపరుడు కాబట్టి మాకు పట్టం కట్టండి అనే వాదనకు ఈ  పరిణామం వల్ల వచ్చే మార్పు ఏమివుండకపోవొచ్చు. కాకపోతే ఏ కొద్దిమందో ఈ కేసు వల్ల జగన్ కి దూరం అయితే వాళ్ళకి పవన్ ఒక ఆప్షన్ లాగా కనపడవొచ్చు. ఆ మేరకు జనసేనకి లబ్ది కలిగే అవకాశం వుంది .

ఇక మీడియా సంస్థలైతే అచ్చం రాజకీయ పార్టీలకి జేబు సంస్థలుగా మారిపోయాయి అని చెప్పటానికి ఏమాత్రం  సంకోచించవలసిన అవసరం లేదు. సోషల్ మీడియా లేకుంటే నిజాలు మాకు తెలిసేవా అని ప్రజలు ఆలోచిస్తున్నారంటే  మీడియా ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది. రెండువైపులా వాదన వినిపించాల్సిన మీడియా కేవలం వారికి అనుకూలమైన వాదనకే  పరిమితమవడం దురదృష్టం . మీడియా మీద ఒక ప్రత్యేక వ్యాసంలో చర్చచేద్దాం. మీడియా వాళ్ళకి ఏమైనా మేలు జరివుంటే అది వాళ్ళ టీఆర్పి రేటింగ్స్ కొంచెం మేరుగుపర్చుకొని వుంటారు కానీ ప్రజలకైతే వచ్చిన మేలిమి ఉండదు .

ఇక ఈడీ విషయానికి వస్తే ఖచ్చితంగా కొన్ని అనుమానాలు రాక తప్పదు. ఏదో ఒక పత్రికలో ఒక ఇన్వెస్టిగేటివ్  జరలిస్ట్ వుండి ఈడీ వాళ్ళు ఈ కేసులో భారతి గారిని చేర్చారు అని కనిపెట్టాడు అని అనుకుందాం . అప్పుడు ఆ వార్త కేవలం ఆ ఒక్క పత్రికలో మాత్రమే ఎక్సక్లూసివ్ గా రావాలిగాని దాని ప్రధాన పోటీ పత్రికలో కూడా ఎలా వస్తుంది . పోనీ ఈడీ ఈ వార్త ఇచ్చింది అనుకుంటే అన్ని పత్రికల్లో రావాలి కదా . కేవలం నాలుగు పత్రికల్లో ఎలా వస్తుంది?  మీడియా కి న్యూస్ లీక్ లు ఇచ్చే స్థాయికి ఒక జాతీయ విచారణ సంస్థ దిగజారితే…. అదీ రాజకీయంగా ఎవరికో మేలు చెయ్యటానికంటే, ఇది వ్యవస్థలు దుర్వినియోగం కాకా మరేమౌతుంది ?

అయినా పిచ్చి కాకపోతే జనం అవినీతి గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసినట్టున్నారు . ఏదో ఒక సినిమాలో హీరోయిన్ ఒక సందర్భంలో ముద్దుగా “ ఎవరు కాదు” అంటుంది ….అలాగే ఫలాన   నాయకుడు అవినీతిపరుడంటే జనాలు ఆ హీరోయిన్ లాగ “ ఎవరు కాదు” అని ఎదురు ప్రశ్నిస్తున్నారు . ఇంతకంటే ఏం చెప్పగలం ?

సమాప్తం

 

వై యస్ భారతి కేసు – ఎవరికేంటి – 1