Home TR Exclusive ఆమరణ దీక్షలు మళ్లీ మొదలవుతున్నాయా?

ఆమరణ దీక్షలు మళ్లీ మొదలవుతున్నాయా?

- Advertisement -

(శివ రాచర్ల)

కడప ఉక్కు పరిశ్రమ కోసం అధికార తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ మరియు, ఎమ్మెల్సి, బిటెక్ రవి నిరహార దీక్ష చేసి కేంద్రం స్పందిచకపోవటం మరియు ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించటం తెలిసిందే.ఈ సందర్భంల్పో చరిత్రలో జరిగిన కొన్ని అమరులైన నిరాహారదీక్షల వివరాలు ఇక్కడ రాస్తున్నాను.

I request friends not to comment on CM Ramesh hunger strike and to respond only on written data and its related information.

సిఎం రమేష్ ను, తెలుగుదేశాన్ని విమర్శించటం వలన ఇక్కడ రాసిన అమరుల త్యాగాన్ని చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు.

కింది అంశాలు చూద్దాం ,

1.నిరాహార దీక్షలో అమరుడైన తోలి నాయకుడు ఎవరు?

2.పొట్టి శ్రీరాములు దీక్ష వలన ఆంద్ర రాష్ట్రం ఏర్పడితే మరి ఎవరి దీక్ష వలన మద్రాస్ రాష్ట్రం పేరు తమిళనాడుగా మారింది?

  1. ఈమధ్య కాలంలో అమరులైన దీక్షలు

1).జతింద్రనాథ్ దాస్

1904లో పుట్టిన జతింద్రనాథ్ దాస్ “అనుశీలన్ సమితి” అనే బెంగాల్ రహస్య విప్లవ గ్రూపులో చేరి భారత్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.

1925లో బిఏ చదివే సమయంలొ జతింద్రనాథ్ వివ్లవ కార్యక్రమాల ముమ్మరంగా నిర్వహించారు.ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.జైలు అధికారులు రాజకీయ ఖైదీల పట్ల అణిచివేత ధోరణిని వ్యతిరేకిస్తు 20 రోజులపాటు నిరహార దీక్ష చేశారు.చివరికి జైలు సూపర్నిడెంట్ క్షమాపణ చెప్పటంతో జతింద్రనాథ్ దీక్ష విరమించారు. సచింద్ర సన్యాల్ వద్ద బాంబుల తయారి నేర్చుకున్న జతింద్రనాథ్ కు సచింద్ర సన్యాల్ ద్వారా భగత్ సింగ్ తదితర ఇతర విప్లవ వర్గాలతో పరిచయాలు ఏర్పడ్డాయి.

 

1928లో సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా “లాలా లజపతి రాయ్” నాయకత్వంలో లాహోరులో జరిగిన ప్రదర్శన మీద జరిపిన లాఠీచార్జిలో గాయపడిన లజపతిరాయ్ ఆ దెబ్బల నుంచి కోలుకోక నెల లోపలే నవంబర్  27, 1928 న చనిపోయారు. లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ మరియు ఆయన మిత్రులు బ్రిటీష్ పోలీస్అధికారి సౌండర్స్ ను 17-Dec-1928న కాల్చి చంపారు.తమ పోరాటాన్ని అందరికి తెలియ చెప్పే ఉద్దేశ్యంతో భగత్ సింగ్ మరియు భటుకేస్వర్ దత్ 8-Apr-1929న డిల్లి అసెంబ్లీలో రెండు పొగ బాంబులు విసిరి “ఇంకిలాబ్ జిందాబాద్” అంటూ నినాదాలు ఇస్తూ కరపత్రాలు వెదజల్లారు. తప్పించుకోకుండా పోలీసులకు దొరికి కోర్టులో తమ రాజకీయ పంథాను చెప్పటం ద్వారా దేశం మొత్తం ప్రచారం కల్పించాలన్న లక్షంతో భగత్ సింగ్ పోలీసులకు దొరికిపోయారు.

ఈ సంఘటన తరువాత పోలీసులు లాహోర్ నగరాన్ని జల్లెడ పట్టి బాంబులు తయారు చేస్తున్న ఇంటిని స్వాదీనం చేసుకున్నారు.ఈ మొత్తం కేసు “లాహోర్ కుట్ర కేసు”గా ప్రసిద్ది చెందినది. ఈ కేసులో జతీంద్ర నాథ్ను బాంబుల తయారి చేసినందుకు అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో ఉంచారు.

లాహోర్ జైల్లొ రాజకీయ ఖైదీల పట్ల అధికారులు అనుసరించిన దుర్మార్గ వైఖరికి నిరసనగా భగత్ లాహోర్ కుట్ర కేసులో నిందితులు నిరహార దీక్ష చేశారు.వీరిలో కొందరు మధ్యలో దీక్ష విరమించగా జతీంద్రనాథ్ మాత్రం జూలై 13, 1929 నుంచి 63 రోజుల పాటు నిరహార దీక్ష చేసి 13-Sep-1929న 25 సంవత్సరాల వయస్సులోమరణించారు.నిరహార దీక్ష చేస్తు మరణించిన తొలి వ్యక్తి,విప్లవకారుడు,నాయకుడు జతింద్రనాథ్ దాస్.

 

2). పొట్టిశ్రీరాములు

జతింద్రనాథ్ తరువాత చెప్పుకోవలసింది పొట్టిశ్రీరాములు ఆమరణ దీక్ష గురించి.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలొని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని నిరహార దీక్ష చేసిన శ్రీరాములు గారు అక్టోబర్  19, 1952 నుంచి 57 రోజులపాటు నిరహార దీక్ష చేసి 15-Dec-1952న అమరులయ్యారు,01-Oct-1953 న కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.ఈ విషయాల చాలాసార్లు రాశాను,ఈపోస్టులో ఎక్కువ వివరాలు రాయటం లేదు.

 

3). శంకరలింగనార్

శంకరలింగనార్

1956లో మొదటి రాష్ట్ర పునః విభజన కమిటి(SRC) ప్రతిపాదించిన భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నవంబర్ 01, 1956న ఆంధ్రా,హైద్రాబాద్ కలిసి ఆంధ్రప్రదేశ్ ,మైసూర్ మరియు మద్రాస్ రాష్ట్రలో ఉన్న కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలిసి కర్ణాటక ఏర్పడగా,వీటికన్నా ఒక్కరోజు ముందు అక్టోబర్  31, 1956 న కేరళా ఏర్పడింది.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు,కన్నడ మరియు మలయాళ ప్రాంతాలువిడదీసి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుండటంతో మిగిలిన మద్రాస్ రాష్ట్రానికి “తమిళనాడు” పేరు పెట్టాలని చాలా ఉద్యమాలు జరిగాయి. తమిళనాడు పేరు కోసం కమ్యునిస్ట్ పార్టి సభ్యుడు శంకరలింగనార్ జూలై 27, 1956 న నిరాహార దీక్ష ప్రారంభించి 76 వ రోజున హాస్పటల్లొ చనిపోయారు.తమిళనాడు పేరు కోసం 1957లో అసెంబ్లీలో DMK ప్రవేశపెట్టిన బిల్లు కాంగ్రేస్ వ్యతిరేకించటంతో వీగిపోయింది.చివరికి 1967 ఎన్నికల్లొ DMK ఎన్నికల్లొ గెలిచి అన్నాదురై ముఖ్యమంత్రి అయిన తరువాత 1968లో మద్రాస్ రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు.ఆ విధంగా పొట్టి శ్రీరాములు,శంకరలింగానార్ అమరులైన తరువాత వారి లక్ష్యం నెరవేరింది. గత దశాబ్ధంలో అమరులైన 2 నిరహారదీక్షలు జరిగాయి.

4). నిగమానంద సరస్వతి

Swami Nigmananda

2011లో గంగా నదిని అక్రమ మైనింగును మరియు కాలుష్యం భారి నుంచి కాపాడాలని ఉత్తరాఖండులో స్వామి “నిగమానంద్ సరస్వతి” ఫిబ్రవరి 19-2011న నిరహార దీక్ష మొదలు పెట్టారు.దీక్ష మొదలు పెట్టిన 68 వ రోజు అంటే ఏప్రిల్  27, 2011న పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి హాస్పటల్లొ చేర్చారు. అయినా కాని నిగమానంద హాస్పటల్లోనే నిరహారదీక్షను కొనసాగించారు. హాస్పటల్లొ ఒక అనుమానాస్పద వ్యక్తి నిగమానందకు ఇంజెంక్షన్ ద్వారా విషాన్ని ఎక్కించారని ఆరోపణలు వొచ్చాయి.చివరికి డీహైడ్రేషన్ వలన దీక్ష మొదలు పెట్టిన 115 వరోజు జూన్ 13, 2011న నిగమానంద సరస్వతి మరణించారు.

5). గురుశరణ్ చాబ్రా

రాజస్థాన్ మాజి MLA(జనతాపార్టి) గురుశరణ్ చాబ్రా మద్యపాన మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని పలుమార్లు నిరాహారదీక్షచేసారు. చాబ్రా తన చివరి నిరాహారదీక్షను 2014 గాంధి జయంతి రోజున (i.e.అక్టోబర్ 02, 2014)న మొదలు పెట్టారు.10 రోజుల తరువాత 13-Oct-2014న చాబ్రా కోమాలోకి వెళ్ళారు ,పోలీసులు ఆయన్ను హాస్పటలుకు తరలించగా దీక్ష మొదలుపెట్టిన 32వ రోజు నవంబర్ 03,2014న కోమాలోనే మరణించారు.

చివరి రెండు త్యాగాల ఫలితాలు దక్కలేదు.ఆతరువాత ఎవరు నిరాహారదీక్షలో మరణించినట్లు లేరు.దీక్షలకు ప్రభుత్వాలు దిగి వొచ్చే పరిస్థితి లేదు,అనేక సందర్భాలలో తాము అధికారంలో ఉండగా ఉద్యమాలను,నిరహార దీక్షలను పట్టించుకోని పార్టీలు అధికారం కోల్పోయిన తరువాత దీక్షలకు దిగటం చిత్రంగానే ఉంటుంది.ఇప్పుడు పొత్తులు తెగిన తరువాత రాష్ట్ర అధికార పార్టీలు కూడా దీక్షలకు దిగటం కొత్త పోకడ,.

(ఫేస్ బుక్ నుంచి)

- Advertisement -

Related Posts

చంద్రబాబు నవనాడులను విరిచేసిన జగన్మోహన్ రెడ్డి!

 ఏనాడూ ఊహించి ఉండడు చంద్రబాబు...జగన్మోహన్ రెడ్డి అనే తన కళ్ళముందు పుట్టి, తన కళ్ళముందే నిక్కర్లు వేసుకుని తిరిగిన యువకుడు...జీవిత చరమాంకంలో తనను చావుదెబ్బ తీస్తాడని ఏమాత్రం ఊహించి ఉండడు!    ఏనాడూ ఊహించి ఉండడు...తన...

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి చంద్రబాబూ.!

తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎంతోకాలంగా మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు, పార్టీని బలోపేతం చేసే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడుగా...

సీఎం జగన్‌ పోరాటం న్యాయ వ్యవస్థ మీదా? వ్యక్తుల మీదా.?

ఎద్దు ఈనిందిరో.. అంటే, దూడని కట్టెయ్యండిరో.. అన్నాడట వెనకటికి ఒకడు. ఎద్దు ఈనడమేంటి? అన్న కనీసపాటి ఆలోచన లేకుండానే 'దూడ' గురించి మాట్లాడటం అవివేకం. అలాంటి అవివేకుల గురించి మాట్లాడే సందర్భంలో ఈ...

Recent Posts

కంచుకోట జిల్లాలో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..?

 నిజామాబాద్ జిల్లా అంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. అలాంటి పార్టీ నేడు ఉనికినే కాపాడుకోలేని స్థితికి చేరుకొని పార్టీ ఆఫీస్ కి తాళలేసుకునే పరిస్థితి దాపురించింది. 2018 ముందస్తు అసెంబ్లీ...

నందమూరి ఫ్యామిలీని వాడేస్తున్న బాబు.. అప్పుడు అన్న ఇప్పుడు తమ్ముడు

 టీడీపీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఇందులో కీలకమైన పొలిట్ బ్యూరో కమిటీని కూడా నియమించాడు. గతంలో పదహారు మంది సభ్యులు కలిగిన ఇందులో ఇప్పుడు...

జగన్ నెక్స్ట్ టార్గెట్ లోకేష్..? బాబులో వణుకు

 తన జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలోచించలేదు. చేతిలో అధికారం లేకపోయిన రోజుల్లో కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకొని తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా...

కాంగ్రెస్ కు చంద్రబాబు మార్క్ ఝలక్

 దుబ్బాక ఉప ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోని ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ...

తెలంగాణపై దృష్టి పెట్టిన చంద్రబాబు, ఆందోళనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై పూర్తి శ్రద్ద కనపరచలేదు. పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చంద్రబాబు నాయుడు పని చేశారు. 2014లో సీఎంగా...

గంటా అధికారికంగా టీడీపీకి వీడ్కోలు పలికాడని చెప్పడానికి ఇదిగో ప్రూఫ్

2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితిని చూసి టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది నేతలు కూడా పార్టీని వీడాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వారిలో వల్లభనేని వంశీ,...

జగన్ చెప్పినా కూడా రోజా శాంతించడం లేదా! ఆ నేతల మధ్య గొడవలు సద్దుమనగవా !

టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శల నుండి వైసీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడిన వాళ్లలో ఎమ్మెల్యే రోజా ఒకరు. జగన్మోహన్ రెడ్డిని విమర్శల నుండి కాపాడటానికి ఆమె అనేకసార్లు విమర్శలపాలు అయ్యారు. ఆమె...

కొడాలి నాని మౌనానికి కేంద్ర బీజేపీ బెదిరింపులే కారణమా!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో ముఖ్యమైన వ్యక్తి కొడాలి నాని. ఆయనకు వైసీపీలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ మీద,...

ట్రాక్ ఎక్కిన రకుల్ ప్రీత్ సింగ్ .. మెగా హీరోలే ఆదుకున్నారట .?

రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఫేయిల్యూవర్స్ లో ఉన్న రకుల్ కి నాగార్జున మన్మధుడు 2 ఇంకా గట్టి షాకిచ్చింది....

అనుష్క శెట్టి విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ..ఆ రోజు బద్దలైపోవాల్సిందే ..!

అనుష్క శెట్టి టాలీవుడ్ లో చాలా లాంగ్ జర్నీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో లైఫ్ టైం తక్కువన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని అనుష్క కి...

Movie News

బుద్ది లేదా అంటూ ఫైర్.. ప్రదీప్ పరువుదీసిన నిహారిక

బుల్లితెరపై ఈ దసరాకు సందడి వేరే లెవెల్‌లో ఉండబోతోంది. ఈ మేరకే ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటివి ప్రత్యేక ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు, స్టార్...

ట్రాక్ ఎక్కిన రకుల్ ప్రీత్ సింగ్ .. మెగా హీరోలే ఆదుకున్నారట...

రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఫేయిల్యూవర్స్ లో ఉన్న రకుల్ కి నాగార్జున మన్మధుడు 2 ఇంకా గట్టి షాకిచ్చింది....

అనుష్క శెట్టి విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ..ఆ రోజు బద్దలైపోవాల్సిందే...

అనుష్క శెట్టి టాలీవుడ్ లో చాలా లాంగ్ జర్నీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో లైఫ్ టైం తక్కువన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని అనుష్క కి...

తన నిర్మాతలకు మహేష్ బాబు వార్నింగ్ బెల్!

ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే చిత్రం గురుంచి ప్రకటన చేశారు. పరశురం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “సర్కారు వారి పాటా”...

Bhanu Shree New HD Wallpapers

Telugu Actress,Bhanu Shree New HD Wallpapers chek out, Shivani Bhanu Shree New HD Wallpapers,Bhanu Shree New HD Wallpapers Shooting spot photos,Actress Tollywood Bhanu Shree...

అసభ్యకరమైన ఫోటో షేర్ చేసింది.. వెంటనే డిలీట్ చేసింది.. అపూర్వ రచ్చ!

ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. కొందరు సెలెబ్రిటీలు కొన్ని పోస్ట్‌లు చేస్తుంటారు.. మళ్లీ వెంటనే తొలగిస్తారు. ఇంకొందరు కొన్ని ఫోటోలు షేర్ చేస్తుంటారు.. తప్పు తెలుసుకుని వెంటనే డిలీట్ చేస్తుంటారు....

Shivani Narayanan Latest pictures

Tamil Actress,Shivani Narayanan Latest pictures chek out, Shivani Narayanan Latest pictures,Shivani Narayanan Latest pictures , Shivani Narayanan Latest pictures Shooting spot photos,Actress Kollywood Shivani...

ఆ సినిమాతో అన్ని కోట్లు పోగొట్టుకున్నాడా.. ఎంఎస్ రాజు కష్టాలు అన్నీ...

ఎంఎస్ రాజు చిత్రాలంటే ఒకప్పుడు వెండితెరపై రికార్డులు సృష్టించాయి. ఆయన పేరు, సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరు కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే భావం ఉండేది. దేవీ, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే...

ఏందయ్యా బ్రహ్మాజీ.. ఇలాంటి టైంలో అలాంటి సెటైర్లా?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఎవరికి ఎలా కౌంటర్లు ఇస్తాడో, రూమర్లు, ఫేక్ న్యూస్‌పై ఎలాంటి కామెంట్లు చేస్తాడో ఎన్నో సందర్భాల్లో చూశాం. కరోనా,...

Meghali Meenakshi Amazing Pics

Meenakshi Amazing Pic,Meghali Meenakshi Amazing Pics, Meghali Meenakshi Amazing Pics Shooting spot photos,Actress Kollywood Meghali Meenakshi Amazing Pics, Meghali Meenakshi Amazing Pics ...