కాలి మెట్టెలు ధరించే స్త్రీలు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు…?

సనాతన హిందూ ధర్మంలో స్త్రీ సౌభాగ్యానికి నుదుటిన కుంకుమ బొట్టు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. వివాహం జరిగిన వెంటనే స్త్రీలు మంగళసూత్రం, బట్టలు భర్త ఆయుష్షుకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల స్త్రీలు వీటిని ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మెట్టెలు మంగళసూత్రం భర్త ఆయుష్షుకి సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. కాకుండా ఇవి స్త్రీ అందానికి అలంకరణగా కూడా ఉంటాయి. వివాహం జరిగిన తర్వాత మెట్టెలు ధరించే విషయంలో మహిళలు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం.

• వివాహం జరిగిన స్త్రీలు ఎల్లప్పుడూ పాదంలోని రెండవ వేలుకి మెట్టెలు ధరించాలి. వెండి మెట్టెలు మాత్రమే ధరించాలి. ఇలా పాదంలోని రెండవ వేలుకి వెండి మెట్టెలు ధరించడం వల్ల స్త్రీల ఆరోగ్యం, మానసిక స్థితి పెంపొందిస్తాయి.

• వివాహితులు పొరపాటున కూడా బంగారు మెట్టెలు ధరించకూడదు. ధనవంతులు కాలికి బంగారంతో చేసిన మెట్టెలు ధరిస్తూ ఉంటారు. బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. కనుక కాలికి బంగారు బుట్టలు ధరించటం వల్ల లక్ష్మీదేవిని కాలితో తాకినట్టు. ఇలా బంగారు మెట్టెలు ధరించటం వల్ల లక్ష్మి దేవి ఆగ్రహానికి గురవుతారు.

• వెండి మెట్టెలు చంద్ర గ్రహానికి సంబంధించినది. ఈ మెట్టెలు ధరించే విషయంలో చేసే పొరపాటు భర్తకు హానికరం. మెట్టెలు స్త్రీ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి పొరపాటున కూడ వాటిని ఇతర మహిళలకు ఇవ్వకూడదు. అలాగే అనవసరంగా తరచూ మెట్టెలను మీ పాదాల నుండి తీయకూడదు. మెట్టెలు పోగొట్టుకోవద్దు.

• మెట్టెలను పోగొట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఇలా జరిగితే భర్త ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు, వివాహిత స్త్రీలు ఎప్పుడు శబ్దం చేయని మెట్టెలు ధరించాలి.