కుబేరుడిని ఎందుకు పూజించాలి ?

దీపావళి అనగానే శ్రీలక్ష్మీపూజ గుర్తుకు వస్తుంది. అయితే ఈ పూజలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆరాధించే సంప్రదాయం గురించి తెలుసుకుందాం.. లక్ష్మీదేవితోపాటు కుబేరుడుని ఆరాధించాలి దీనికి కారణం తెలుసుకుందాం.. శ్రీలక్ష్మి దేవి సకల సంపదలను ప్రసాదించే దేవత.

కుబేరుడు ఆమెకు కోశాధికారి. చాలామందికి ధనాన్ని సంపాదించే కళను కలిగి వుంటారు. కానీ వారికి ఎలా పొదుపు చేయాలో తెలియక వృధా ఖర్చులు చేసి ధనాన్ని అంతా పోగొట్టుకుంటారు . వాస్తవానికి ధనాన్ని సంపాదించడంతోపాటు దానిని ఆదా చేయడం, తగిన చోట ఖర్చు పెట్టడం చాలా ముఖ్యంమైనది. దేవత కుబేరుడు తానే కోశాధికారి కాబట్టి ఈ కళను నేర్పే దేవత. కాబట్టి ఈ పండుగకు లక్ష్మి దేవిని, దేవత కుబేరున్ని పూజించమని చెప్తారు. ప్రజలందరూ, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఈ పండుగను ఎంతో శోభాయమానంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అందుకే దీపావళిరోజు లక్ష్మీదేవి పక్కన కుబేరుడుని పెట్టి పూజించాలి. ఒకవేళ అవకాశం లేకుంటే తమలపాకలో వక్క, ఖర్జూరం, దక్షిణ పెట్టి కుబేరుడిని ఆవాహనం చేసి శ్రీలక్ష్మీ, కుబేర దేవతలను ఆరాధించాలి.