సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుడిలో మనకు గంట కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆలయంలోకి వెళ్లగానే భక్తులు గంటను కొట్టే స్వామివారిని నమస్కరించుకుంటారు.అదేవిధంగా స్వామివారికి మంగళహారతి ఇచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున గంటను మోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో గంటలు ఎందుకు కడతారు గంటలు మోగించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
మనం గంటను కొట్టినప్పుడు గంట నుంచి వినపడుతుంది. ఇలా మనం ఎప్పుడైతే గంట శబ్దం వింటమో మన మనసు మొత్తం ఒక్కసారిగా దేవుడిపై ఉండి భగవంతుడిని నమస్కరిస్తాము. క్రమం తప్పకుండా గంట శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడి వాతావరణం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటుందని అర్థం. స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట కొట్టడం వల్ల మనిషి చేసిన 100 పాపాలు నశిస్తాయని స్కంద పురాణం తెలియజేస్తుంది.
ఇలా ఇంట్లో లేదా దేవాలయాలలో గంట మోగినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి దుష్టశక్తులు ఉండవని ఆ ప్రాంతం మొత్తం ఎంతో పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటుందని అర్థం.ఇక దేవుడికి మంగళహారతి ఇచ్చే సమయంలో కూడా గంటలు మోగిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తుల మనసు మొత్తం దేవుడిపై నిమగ్నం అవుతూ దేవుడిని స్మరించుకోవడంతో మన మనసు కూడా తేలికగా ఉంటుందని అలాగే ఆ శబ్దం మనపై ప్రతికూల వాతావరణాన్ని తొలగించి అనుకూల పరిస్థితులను కల్పిస్తుందని చెబుతారు. అందుకే ఆలయ ప్రాంగణంలో మనం గంట ధ్వని విన్నప్పుడు మనసు కూడా తేలికగా ఉంటుంది.