హిందూధర్మంలో అనేక ఆచారాలు. వాటి వెనుక అనేక రహస్యాలు. అలాంటి వాటిలో ఇంటిముందు దోషాలు, దిష్టిపోవడానికి కట్టే గుమ్మడికాయ గురించి అనేక సందేహాలు ఆ విశేషాలు తెలుసుకుందాం.. సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్ళకు, ఆఫీసుల గుమ్మాలకు గుమ్మడికాయ కడతారు. సాధారణంగా పధ్ధతి ప్రకారం చెప్పాలి అంటే కట్టిన గుమ్మడికాయ కుళ్ళకూడదు. గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలలోపల ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిది.
అలా కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే, ఎండిపోతే తిరిగి కొత్తది కట్టుకోవచ్చు. కొత్త గుమ్మడికాయను ఏ రోజు పడితే ఆ రోజు కట్టకూడదు. ఆదివారం లేదా గురువారం కట్టాలి. ఎందుకంటే ఈ రెండు వారాలకు భూతప్రేత పిశాచాలను అరికట్టే వారాలు. కొత్త గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టి వాకిట్లో కట్టాలి. ఎందుకంటే ఇది సర్వబాదా నివృత్తి చేస్తుంది. ఎప్పుడూ గుమ్మడికాయ గుమ్మానికి కట్టి ఉంచడం చాలా అవసరం. ఏడాదికి ఒకసారి మార్చమని ఎక్కడా చెప్పలేదు.
అదేవిధంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పుణ్యదినాలలో కూడా గుమ్మడికాయను మార్చువచ్చు. కానీ చిద్రమైనదాన్ని మాత్రం ఇంటి ముందర ఉంచకూడదు.