Samantha: సినీనటి సమంత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈమె డైరెక్టర్ రాజ్ నిడుమోరితో కలిసి పెద్ద ఎత్తున కెమెరాకు చిక్కడంతో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఇటీవల సమంత నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సమంత రాజ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేయడమే కాకుండా తన భుజంపై తల వాలుస్తూ ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వీరిద్దరూ కచ్చితంగా రిలేషన్ లో ఉన్నారని, సమంత తన రెండో పెళ్లి గురించి ముందుగా ఇలాంటి హింట్ ఇస్తుంది అంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత రాజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఉండటం కోసం ఒక కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. వీరి అభిరుచులకు అనుగుణంగా ఉన్నటువంటి ఫ్లాట్ కోసం వెతికే పనిలో పడ్డారట.
ఇలా వీరిద్దరూ వివాహం చేసుకున్న అనంతరం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడే ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత డైరెక్టర్ రాజ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే వాళ్లే స్పందించాల్సి ఉంది.. ఇక డైరెక్టర్ రాజ్ ఇదివరకే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈయన తన భార్య శ్యామలకు విడాకులు ఇచ్చారని, అందుకే సమంతను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.