హిందూ ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగని ప్రలందరు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఇంటి ముందు రంగుల ముగ్గులతో, పువ్వులతో అందంగా అలంకరిస్తారు. అంతే కాకుండా ఈ పండుగ రోజున గాలిపటాలు, గంగిరెద్దుల కోలాహలం, హరిదాసు గీతాలతో పల్లెటూళ్ళు సందడిగా ఉంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున ఈ సంక్రాంతి పండుగ ని జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షణాయనానికి చేరుకుంటాడు. ఈ పండుగ రోజున సూర్యదేవునికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
అంతేకాకుండా సంక్రాంతి పండుగ రోజున శనీశ్వరుడిని కూడా పూజిస్తారు. ఈ పండుగ రోజున దానధర్మాలకు చాలా ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల నువ్వులు దానం చేయటం వల్ల ఆ శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాకుండా ఈ పండుగ రోజున నువ్వుల నూనెతో శని దేవుడికి అభిషేకం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీ దోషం ఉన్నవారు సంక్రాంతి పండుగ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురైన సమస్యలు అన్ని తొలగిపోయి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు.
అలాగే ఈ మకర సంక్రాంతి రోజున ఉదయమే శివలింగానికి నీటితో అభిషేకం చేయటం వల్ల కూడా మనకి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున దేవతలతో పాటు చెట్లని పూజించడం కూడా ప్రత్యేకత. అందువల్ల తులసి మొక్కతో పాటు జిల్లేడు, రావి వంటి చెట్లను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున దానధర్మాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున బెల్లం, నువ్వులు, బియ్యం వంటి వాటిని దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.