దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరిస్తున్నారా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా చాలామంది వారికి ఎంతో ఇష్టమైన దేవుళ్ల ప్రతిమలను వారు వేసుకున్నటువంటి చైన్ లాకెట్ లేదా ఉంగరానికి కూడా దేవుడి ప్రతిమలు ఉన్న వాటిని వేసుకుంటారు.ఈ క్రమంలోనే చాలామంది దేవుడి ప్రతిమ కలిగినటువంటి ఉంగరాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ విధంగా దేవుడి ఉంగరం పెట్టుకున్న వారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే…

దేవుడి ప్రతిమలు కలిగి ఉన్నటువంటి ఉంగరాలను ధరించేవారు ఎల్లప్పుడూ కూడా ఆ ఉంగరాన్ని కుడి చేతికి మాత్రమే వేసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతికి పెట్టుకోకూడదు. ఇలా ఎడమ చేతికి పెట్టుకోవడం వల్ల భగవంతుడి ఆగ్రహం వ్యక్తం చేస్తారు.ఇక కుడి చేతికి దేవుడు ప్రతిమ పెట్టుకున్న వారు మాంసాహార పదార్థాలను తినే సమయంలో చేతికున్న ఉంగరాన్ని తీసేయడం మంచిది అదేవిధంగా మహిళలు అయితే నెలసరి సమయంలో కూడా దేవుడి ఉంగరాలను లేదా లాకెట్ ఉన్నప్పటికీ తొలగించడం మంచిది.

ఇక చాలా మంది దేవుడి ప్రతిమలు కలిగి ఉన్నటువంటి ఉంగరాలను ధరించినప్పటికీ ఇలాంటి నియమ నిబంధనలను ఏమాత్రం పాటించరు కాకపోతే వీటిని పాటించడం వల్ల భగవంతుడి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని పండితులు చెబుతుంటారు. ఇక ఎక్కువగా భగవంతుడి ఉంగరాల కన్నా తాబేలు ప్రతిమ కలిగినటువంటి ఉంగరాలను పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఉంగరం పెట్టుకోవడం వల్ల కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని భావిస్తారు. అయితే ఇలాంటి ఉంగరం పెట్టుకున్న సమయంలో కూడా ఇలాంటి నిబంధనలను పాటించడం ఎంతో మంచిది.