దేవాలయ దర్శనం అంటేనే పవిత్రంగా భావిస్తాం. అయితే ఇటీవల చాలామందికి రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి వాటిలో దేవాలయానికి ముందు మాంసాహారం తినవచ్చా. తింటే ఆ రోజు దేవాలయానికి వెళ్లకూడదా? దీని గురించి ఆయా పండితులు చెప్పిన విషయాలు పరిశీలిద్దాం…
మన ప్రవర్తన మనం తినే ఆహారం పై ఆధార పడి ఉంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారం తమో గుణాన్ని పెంచుతుంది. అలాగే శాకాహారం అయిన ఉల్లిపాయలు కూడా తమోగుణాన్ని పెంచుతాయి. మాంసాహారం తిన్న తరువాత దైవ దర్శనం చేసుకో కూడదు అని ఎక్కడా చెప్పలేదు.. కానీ ఒక పవిత్ర భావనతో దైవ దర్శనం చేసుకుందాం.. అని అనుకున్న వారు మాంసాహారం తీసుకోకుండా దైవ దర్శనం చేసుకోవడం మంచిది. అసలు ఏ ఆహారం స్వీకరించకుండా (మాంసాహారం / శాకాహారం ) దైవ దర్శనం చేసుకోవడం చాల మంచిది.
తమోగుణం వల్ల మనకు అనేక రకాల దుష్ట ఆలోచనలు వస్తాయి. కామ, క్రోధత్వాలు రావచ్చు. అందుకే పవిత్రమైన స్థలాలకు వెల్లినప్పుడు ఉపవాసం ఉండి లేదా శుచి,శుభ్రతతో వెలితే ప్రశాంతత, అనుకూలత లభిస్తాయి అనేది శాస్త్రవచనం. కాబట్టి దేవాలయాలకు వెళ్లేటపుపడు ఉదయం అయితే ఏమీ తినకుండా వెళ్లండి. ఒకవేళ సాయంత్రం వెళ్లాల్సి వస్తే సాత్విక ఆహారం తీసుకోండి. మద్యం, మాంసం, తమోగుణ ప్రధానంగా ఉండే ఆహారాలను ఆరోజు స్వీకరించకపోవడం మంచిది.