తిరుచానూరలో పద్మావతి అమ్మవారి నవరాత్రులు !

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 17 నుంచి 26వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

tiruchanur padmavathi ammavari navaratrulu
tiruchanur padmavathi ammavari navaratrulu

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలోనే ఊంజల్సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 26వ తేదీనాడు ఆలయంలో గజ వాహనసేవ చేపడతారు. ఈ ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవ, అక్టోబరు 23న లక్ష్మీపూజ సేవలు రద్దయ్యాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యాక్రమాలను టీవీలలో ప్రతక్షప్రసారంలో చూడవచ్చు.