లక్ష్మీ అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్దలు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆయా పురాణాలలో, శాస్త్రాలలో చెప్పిన సులభమైన పరిహారాలు తెలుసుకుందాం…
శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ప్రతిరోజూ రోజూ పూజా చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది. ఈ పైన చెప్పిన పరిహారాలను మంచి రోజు చూసుకుని ప్రారంభించి, శ్రద్ధతో ఆచరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి.