హీరోయిన్ తాప్సీపై కేసు.. అలా ఆభరణం ధరించినందుకే!

హీరోయిన్ తాప్సీపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె జరిగిన ముంబై-లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొన్న తాప్సీ ఔట్ ఫిట్ వివాదానికి దారితీసింది. ఆ ఫ్యాషన్ ఈవెంట్ లో తాప్సీ కనబడిన తీరుపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ ఈవెంట్ లో తాప్సీ ఔట్ ఫిట్ టూ మచ్ బోల్డ్ గా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

టూ బోల్డ్ ఔట్ ఫిట్ పైకి తాప్సీ ధరించిన బంగారు ఆభరణం వివాదానికి దారి తీసింది. వెరీ డీప్ లోనెక్ డ్రెస్సు ధరించిన తాప్సీ.. మెడలో లక్ష్మీ దేవి విగ్రహంతో ఉన్న నెక్లెస్ ధరించింది. ఒకవైపు అభ్యంతరకర రీతిలో డ్రెస్సులు ధరించి వాటిపై లక్ష్మీ దేవి ఆభరణాన్ని ధరించడం హిందూ మతస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు ఎదుర్కొంది తాప్సీ.

హీరోయిన్ తాప్సీ వస్త్రాధారణ మెడలో లక్ష్మీ దేవి ఆభరణం తమ మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్ ఏకలవ్య సింగ్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మతపరమైన మనోభావాలు, భారతీయ సనాతన ధర్మ ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు నటి తాప్సీ పన్నుపై ఏకలవ్య గౌర్ నుండి ఫిర్యాదు అందినట్లు పోలీసులు ధ్రవీకరించారు.

టూమచ్ బోల్డ్ డ్రెస్సుపైకి లక్ష్మీ దేవి విగ్రహం ఉన్న ఆభరణం ధరించడంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు తర్వాత తాప్సీ పన్నుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అశ్లీలమైన డ్రెస్సు ధరించి, దానిపై లక్ష్మీదేవి ఆభరణం ధరించడం పక్కా కుట్ర అని, సనాతన ధర్మాన్ని చులకన చేసేందుకు ఈ ప్లాన్ వేశారని ఏకలవ్య గౌర్ ఆరోపణలు చేశారు.

మార్చి 12వ తేదీన జరిగిన ముంబై-లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై హొయలు పోయింది తాప్సీ పన్ను. రెడ్ కలర్ గౌనులో అందాలు ఆరబోసింది. వెరీ డీప్ లోనెక్ గౌనుతో పరువాల ప్రదర్శనతో రచ్చలేపింది. లోపల బ్రా లాంటి ఇన్నర్ వేర్ ఏదీ లేకుండా ర్యాంప్ పై నడుస్తున్నప్పుడు ప్రైవేటు పార్ట్స్ కనిపించడంపై సోషల్ మీడియాలో తాప్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.