ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు !!

తిరుమలలో ఈసారి కొవిడ్‌ మహ్మరితో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల తిరుపతిలో ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. చరిత్రలో మొదటిసారిగా భక్తులు లేకుండానే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

రెండుసార్లు బ్రహ్మోత్సవాలు ఆశ్వీజమాసం అధికమాసం రావడం వల్ల ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. దీనికోసం టీటీడీ తగు చర్యలను చేపడుతుంది.

Thirupathi Brahmotsavalu are very peaceful
Thirupathi Brahmotsavalu are very peaceful

ఈసారి రెండు సార్లు బ్రహోత్సవాలు జరపాలని టీటీడీ పాలక మండలి గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రంగనాయకుల మండపంలో స్థలబావం కారణంగా వాహన సేవలను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక, స్వర్ణ రథం, రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించనున్న టీటీడీ అధికారులు తెలిపారు. ఇక, వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుండి 10గంటల వరకు మాత్రమే శ్రీవారి వాహన సేవలు. తిరిగి రాత్రి 7నుండి 8 గంటల వరకు వాహనసేవలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 27న శ్రీవారి ఆలయంలోని అద్దాల మహల్ లో ఉదయం 6 నుండి 9గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆన్ లైన్ లో కళ్యాణోత్సవ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.