దీపావళి పండుగ రోజు చేయాల్సిన చేయకూడని పనులు ఇవే?

ప్రతి ఏడాది మనం ఎన్నో పండుగలను ఎంతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము. ఇక ప్రతి ఏడాది జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి.ఇక దీపావళి పండుగ రోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది ఈ పండుగ అక్టోబర్ 24వ తేదీ వచ్చింది.మరి దీపావళి పండుగ రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే….

దీపావళి పండుగను ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజ చేసుకుంటారు. అయితే పూజ చేసే సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాము కనుక లక్ష్మీదేవిని పూజించే ముందు వినాయకుడికి పూజ చేయాలి. ఇక ఇంట్లో వినాయకుడిని పసుపుతో తయారు చేసుకున్న అనంతరం వినాయకుడు పూజ చేసిన తర్వాత లక్ష్మీ పూజ చేయాలి. ఇంట్లో కలశం ఏర్పాటు చేసే సమయంలో వరి పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. దీపావళి రోజు దీపాలను నెయ్యి లేదా ఆవనూనెతో వెలిగించడం మంచిది.ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పుష్పాలతో అలంకరించి పూజ చేయడం శుభప్రదం. దీపావళి రోజు ఈ విధంగా పూజ చేయడం మంచిది.

ఇక పండుగ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అంటారు మరి దీపావళి రోజు చేయకూడని పనులు ఏంటి అనే విషయానికి వస్తే… దీపావళి పండుగ రోజు ముగ్గు వేసే సమయంలో ముగ్గులో నలుపు రంగులు లేదా బ్రౌన్ కలర్ రంగులను ఉపయోగించకూడదు. ఇక ఎవరికైనా బహుమతులు ఇచ్చే సమయంలో పొరపాటున కూడా లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు.అమ్మవారికి పూజ చేసే సమయంలో మన ధ్యాస మొత్తం అమ్మవారి పై ఉండాలి కానీ ఇతరులపై కోపం ప్రదర్శిస్తూ ఇతరులను తిడుతూ ఉండకూడదు. మన ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన వస్తువులను దీపావళికి ముందు రోజు ఇంట్లో నుంచి బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.