సాధారణంగా కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా డబ్బులు వచ్చినట్లే వచ్చి ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటాయి ఈ క్రమంలో వారు మళ్లీ అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి కొంత మంది మాత్రం కష్టం చేయకపోయినా కూడా ఆర్థికంగా నిలదొక్కుకొని సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలా కష్టపడకుండానే డబ్బు రావడానికి కారణం లక్ష్మీదేవి కటాక్షం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఇలా కష్టపడకుండానే డబ్బు వస్తుంది. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి అమ్మవారిని నియమ నిష్టలతో నిత్యం పూజిస్తూ ఉండాలి.
అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ఇంట్లో వాతావరణం కూడా ఎటువంటి కలహాలు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టి వారిని కరుణిస్తుంది. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించడానికి ముందు మనకి కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో మూడు బల్లులు కలిసి ఒకే దగ్గర ఉండటం కూడా లక్ష్మీదేవి ప్రవేశానికి శుభసూచికగా చెప్పవచ్చు. అంతేకాకుండా పురాణాల ప్రకారం దీపావళి రోజున తులసి చెట్టు చుట్టూ బల్లి కనిపించినప్పుడు అది లక్ష్మీదేవి రాకకు సూచన అని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పక్షి ఇంట్లో గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ప్రవేశానికి సూచనగా భావిస్తారు. అలాగే కుడి చేయి అరచేతిలో దురద పెట్టటం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావిస్తారు. అలాగే నిద్రిస్తున్న సమయంలో కలలో బల్లి పాము గుడ్లగూబ ఏనుగు ముంగిస గులాబీ శంఖం మొదలైనవి కనిపించినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుందని నమ్మవచ్చు. ఇలా ఇది సంకేతాలు కనిపించినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుందని నమ్మవచ్చు.