శ్రీవేంకటేశ్వరుడు.. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అర్చితామూర్తిగా కలియుగంలో అవతరించిన అవతారం. తిరుమలలో వెలసిన స్వయంభూ శ్రీస్వామి. ఆ స్వామని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలు పెద్దలు పేర్కొన్నారు. వాటిలో వజ్రకవచ పారాయణం ఒకటి. ఈ కవచం గురించి తెలుసుకుందాం…
మార్కండేయ ఉవాచః
‘‘నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతుమే హరిః
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ’’
ఇతి మార్కండేయకృత వేంకటేశ్వర వజ్రకవచం దీన్నినిత్యం ఎవరు అయితే పారాయణం చేస్తారో వారికి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మృత్యుభయం పోతుంది. పరిపూర్ణ ఆయుఆరోగ్యాలను పొందుతారు.