సాధారణంగా మనం ఆర్థికంగా ఎంతో ఎదుగుతున్న సమయంలోను లేకపోతే మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్న సమయంలోను ఇతరుల దృష్టి మనపై పడటం సర్వసాధారణం.ఇలా నరదృష్టి ఏ కుటుంబం పై అయితే ఉంటుందో అలాంటి కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా నర దిష్టి ఉన్న కుటుంబం క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా తమ ఇంటిలో సంతోషాలు లేకుండా ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు.ఇలాంటి నరదిష్టి సమస్యలు తొలగిపోవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణంలో ఈ మొక్కను నాటితే అన్ని శుభలే కలుగుతాయి.
వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావాలు మన ఇంటిపై పడకుండా మన ఇంటిలోకి పూర్తి అనుకూల వాతావరణ పరిస్థితిలను కల్పిస్తాయి. ఇలా ఇంటి ఆవరణంలో ఉండాల్సిన మొక్కలలో పాలాగుతీగ మొక్క ఒకటి. ఈ మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల వాస్తు దోషాలు మాత్రమే కాకుండా నర దిష్టి, నర శాపం కను దిష్టి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
పాలాకు తీగ మొక్కను మేకమేయని మొక్క అని కూడా పిలుస్తారు.ఈ మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఎలాంటి దుష్టశక్తులు మన ఇంటిలోకి ప్రవేశించవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక మంగళవారం ఆదివారం లేదా అమావాస్య రోజున ఉదయమే తల స్నానం చేసి ఈ మొక్కను నమస్కరించుకొని కొన్ని కొమ్మలను తుంచి ఇంటికి మామిడి ఆకుల తోరణం కట్టిన విధంగా కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దోషాలు, మన ఇంటిపై ఏర్పడినటువంటి నరదృష్టి తొలగిపోతుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది.