మహాశివరాత్రి విశిష్టత.. ఈ ఏడాది ఏ తారీకున శివరాత్రి జరుపుకోవాలో తెలుసా?

మన భారతీయ సంస్కృతిలో పండుగలకు చాలా విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాలలో స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు జరుపుకుంటూ ఉంటారు. మన హిందూ సంస్కృతిలో కూడా ప్రజలు అనేక పండుగలు జరుపుకుంటారు. ఇక మాఘ మాసంలో వచ్చే మహాశివరాత్రి పండుగను కూడా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహా శివుడికి ప్రీతికరమైన మాఘమాసంలో వచ్చే ఈ మహాశివరాత్రి పండుగ రోజున ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలు, జాగరణలు చేస్తారు. సాధారణంగా అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంతారు. కానీ ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటారు.

మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిస్తాడని ప్రజల నమ్మకం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉంది రాత్రి నిద్ర పోకుండా జాగరణ చేస్తూ శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. ఇక ఏడాది మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18, శనివారం త్రయోదశి తిథి కాగా ఈ తిథిలో ప్రదోష వ్రతాన్ని కూడా పాటిస్తారు. త్రయోదశి తిథి ముగిసిన వెంటనే చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. అంటే శనివారం రాత్రి 08.05 గంటలకు మహా శివరాత్రి ప్రారంభమవుతుంది, అది 19 ఫిబ్రవరి 2023 సాయంత్రం 04.21 నిమిషాలకు ముగుస్తుంది.

ప్రతి యేడు ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు నాలుగు గంటల్లో మహాదేవుని ఆరాధించడం విశేష ప్రాముఖ్యత ఉందని, రాత్రి 8 వ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఇక మహాశివరాత్రి రోజున శుభ ఘడియల విషయానికి వస్తే .. ఫిబ్రవరి 18 శనివారం రోజున
• మధ్యాహ్నం 12:29 నుంచి 01:16 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది.
• మధ్యాహ్నం 12:02 నుండి 01:27 వరకు అమృతకాలం
• సాయంత్రం 06:37 నుండి 07 వరకు:02 వరకు సంధ్య ముహూర్తం