భద్రాచలంలో రాములోరి కళ్యాణ మహోత్సవం.. తలంబ్రాల కోసం 80 క్వింటాళ్ల బియ్యం …!

మన భారతదేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో భద్రాచలం కూడా ఒకటి. సీతారాముల కొలువై ఉన్న ఈ భద్రాచలం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి దేశం నలవైపుల నుండి ఎంతోమంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది జరగబోయే సీతారాముల కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల కోసం జంగా రెడ్డి గూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నుంచి 80 క్వింటాళ్ల బియ్యం పంపుతున్నట్లు సమితి అధ్యక్షుడు ముళ్ళపూడి వీర వెంకటన్న సత్యనారాయణ వెల్లడించారు.

భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి
జంగా రెడ్డి గూడెం నుంచి తలంబ్రాల బియ్యం ఆదివారం పంపినట్లు వెల్లడించారు. అంతే కాకుండా సమితి ప్రతినిధులు సీతా రాములకు పూజాదికాలు నిర్వహించిన తర్వాత 20 క్వింటాళ్ల బియ్యం పంపే వాహనానికి పూజ చేసి జై శ్రీరామ్ నామ స్మరణ చేస్తూ కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని ముందుకు పంపారు. సీతారాముల కళ్యాణం లో ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించి తలపై ధరిస్తారని సత్యనారాయణ వెల్లడించారు. అలాగే రైతులు భక్తుల నుండి సేకరించిన 150 క్వింటాళ్ల బియ్యం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితికి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే సీతారాముల కళ్యాణం లో తలంబ్రాల కోసం ఉపయోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి తలంబ్రాల కోసం పంపారని, శ్రీ రామ నవమికి గోటితో వలిచిన తలంబ్రాల తో జంగా రెడ్డి గూడెం రామాలయం నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇంకా ఎవరికైనా తలంబ్రాల కోసం బియ్యం కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ 9441918489 కు సంప్రదించాలని ఆయన వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు తొందర్లోనే మొదలు కానున్నాయి.