తులసి చెట్టు వద్ద ఈ వస్తువులను ఉంచారా… వెంటనే తొలగించండి?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి చెట్టుని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తాము. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ నమస్కరిస్తుంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు అందుకే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇకపోతే కార్తీక మాసంలో తులసి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంటుంది ఈ క్రమంలోనే తులసి కోట చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచి తులసిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. పొరపాటున కూడా తులసి కోట చుట్టూ ఈ వస్తువులు కనుక ఉంటే వెంటనే తీసివేయడం మంచిది.

తులసి కోట చుట్టూ పరిశుభ్రంగా ఉండాలి. అలా కాకుండా తులసి కోట పరిసర ప్రాంతాలలో పొరపాటున కూడా చెప్పులను వదలకూడదు. తులసి కోట ముందు చెప్పులు ఉంచడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి సుఖసంతోషాలు ఆనందం ఉండదు. చీపురుని కూడా తులసి కోట పరిసర ప్రాంతాలలో ఉంచకూడదు చీపురు మురికిని శుభ్రం చేస్తుంది కనుక అలాంటి చీపురును తులసి దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం సూచిస్తుంది. పేదరికం ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉండదు.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టు పరిసర ప్రాంతాలలో ముళ్ళు ఉన్న చెట్లను నాటకూడదు. ఇలా ముళ్ళు కలిగినటువంటి చెట్లను నాటడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. తద్వారా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అదేవిధంగా చెత్త డబ్బాని కూడా తులసి దగ్గర ఉంచకూడదు. ఇక శివలింగాన్ని కూడా తులసి వద్ద ఉంచకూడదు. శివ పూజకు ఉపయోగించే ఏ వస్తువులను కూడా తులసి చెట్టు పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.