వాస్తు దోషాలు తొలగిపోవాలంటే పారిజాత వృక్షాన్ని ఈ దిశలో నాటాల్సిందే!

సాధారణంగా మన ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో విశ్వసిస్తాము. ఈ క్రమంలోనే మనం ఏ పని చేయాలన్న ముందుగా వాస్తు చూసుకొని ఇంట్లో వస్తువులను అలంకరించుకోవడం లేదా కొన్ని రకాల మొక్కలను నాటుకోవడం జరుగుతుంది. అయితే సకల దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి పారిజాత వృక్షం మన ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల ఎంతో శుభం కలుగుతుందని భావిస్తారు.అయితే దేవతలకు ఎంతో ఇష్టమైన ఈ పారిజాత వృక్షం మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని భావిస్తారు.

ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అంటే పారిజాత వృక్షాన్ని సరైన దిశలో నాటాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాత వృక్షం ఏ దిశలో ఉండాలి అనే విషయానికి వస్తే.. పారిజాత వృక్షంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణలు కొలవై ఉంటారని భావిస్తారు.ఈ చెట్లు శరదృతువులో దుర్గాపూజకు ముందు పుష్పించడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. దీనిని దేవి పక్షం అని పిలుస్తారు ఈ పుష్పాలతో దుర్గాదేవిని పూజించడం వల్ల అని శుభ పరిణామాలు కలుగుతాయని భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ పారిజాత వృక్షాన్ని నాటేటప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పారిజాత వృక్షం సోమవారం లేదా శుక్రవారం నాటడం ఎంతో మంచిది ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం ఈ పారిజాత మొక్కను నాటడం వల్ల శుభం కలుగుతుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీవారం కనుక ఈ మొక్కను నాటడం శుభప్రదం. అయితే ఈ మొక్కను నాటేటప్పుడు ఉత్తర దిశలో నాటడం ఎంతో మంచిది. ఉత్తర దిశలో శాంతి సంపద శ్రేయస్సుకు కారణమవుతుంది.ఏ ఇంటి ఆవరణంలో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఏర్పడి ఉంటుంది. ఆ ఇంటిల్లిపాది ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటారు. అలాగే ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.