ప్రతి ఏడు శివరాత్రి తరువాత వచ్చి అమావాస్యని సోమావతి అమావాస్య అని అంటారు. ఈ ఏడాది శివరాత్రి తర్వాత ఫిబ్రవరి 20వ తేదీ సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు. ఈ సోమావతి అమావాస్య రోజున శివపార్వతులను పూజించటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ప్రజల నమ్మకం. శివరాత్రి రోజున ఉపవాస దీక్షలో చేయటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున వివాహిత మహిళలు ఉపవాస దీక్షలు చేయటం వల్ల భర్తకి దీర్ఘాయుషు లభిస్తుంది. ఈ రోజున వివాహిత స్త్రీలు శివ ఫలితాలను ఇచ్చే కొన్ని చర్యలు తీసుకోవాలి.
సోమావతి అమావాస్య రోజున పార్వతీ మరియు శివుడిని పూజించడం సత్ఫలితాలు లభిస్తాయి. మహిళలు శివలింగానికి పచ్చిపాలతో అభిషేకం చేయడమే కాకుండా సుగంధ పరిమళాలు కలిగిన వస్తువులను పార్వతి దేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాకుండా భర్త ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతాడు. అలాగే సోమావతి అమావాస్య రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి శివాలయానికి వెళ్లి రావి చెట్టును నాటాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోసించి పితృ దోషం తొలగిపోతుంది .
సోమావతి అమావాస్య రోజు కుంకుమ పువ్వులను హవనంలో సమర్పించి జీవితంలో తెలిసి, తెలియక మనం చేసిన తప్పులకు క్షమాపణలు కోరాలి.అలాగే సోమావతి అమావాస్య రోజు తెల్లవారుజామున శివుని ఆచార పూజలు చేసేటప్పుడు రుద్రాభిషేకం కూడా చేయండి. అలాగే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి ఒక జత వెండి పాములను పూజించాలి. ఇలా చేయటం వల్ల కాలసర్ప దోషం నుండి విముక్తి లభించి ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే సోమావతి అమావాస్య రోజున గోవుకు ఐదు రకాల పండ్లు తినిపించండి.ఆ తర్వాత శ్రీహరి మంత్రాన్ని జపిస్తూ తులసికి 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయటం వల్ల భార్య భర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు.