మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం అయిన స్త్రీలు ఎన్నో రకాల ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.వివాహం ముందు ఎలా ఉన్నప్పటికీ వివాహం తర్వాత వారి వస్త్రధారణ నుంచి వారి అలవాట్లు కట్టుబాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఈ విధంగా పెళ్లయిన తర్వాత మహిళలు మెడలో ఉండే మంగళసూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మంగళసూత్రాన్ని దైవ సమానంగా భావిస్తూ ఉంటారు.తన మెడలో మంగళసూత్రం పది కాలాలపాటు చల్లగా ఉండాలని ప్రతి ఒక్క మహిళ భావిస్తుంది.
ఇకపోతే మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం పొరపాటున తెగిపోయిన వెంటనే మహిళ మంగళసూత్రం స్థానంలో తన భర్త చేత పసుపు కొమ్ము కట్టించుకుంటుంది. అయితే చాలామంది మంగళసూత్రాన్ని బయట వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలాగే మరికొందరు బయటకు కనపడకుండా వేసుకుంటారు. మంగళసూత్రం ఇతరులకు కనిపించకూడదని చెబుతుంటారు. ఇలా మంగళసూత్రం ఇతరులకు ఎందుకు కనిపించకూడదు ఏంటి అనే విషయానికి వస్తే..
ఒకప్పుడు మంగళసూత్రాన్ని మట్టితో తయారు చేసిన నల్లటి పూసలను వేసుకునేవారు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రాన్ని బంగారు గొలుసుతో వేసుకుంటున్నారు అయితే నల్లపూసలు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని గ్రహిచి శరీరానికి చలువ చేస్తుంది. అయితే బంగారు గొలుసు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న వేడికి మరి కాస్త వేడిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతు భాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది.
చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు రాకుండా ఉంటాయి అందుకే ఎంతో పవిత్రమైన ఈ నల్లపూసలను ఎప్పుడూ కూడా లోపలే వేసుకోవాలని చెబుతారు.