సాధారణంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొందరికి ఎంత కష్టపడి పని చేసినా కూడా డబ్బు వారి వద్ద మిగలదు. సిరి సంపదలకు ప్రతిరూపంగా భావించే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై సిరిసంపదలు కలుగుతాయి. అయితే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే లక్ష్మీదేవి మన మీద అనుగ్రహం చూపుతుందని ముందే సూచనలు తెలుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉందని తెలిపే సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా కొన్ని సందర్భాలలో మనం డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాము. అలాంటి సమయంలో మనకు చాలా బాధగా అనిపిస్తుంది. మరికొంతమంది ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళగానే డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఉదయం పూట డబ్బులు పోగొట్టుకోవడం వల్ల చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా ఉదయం పూట డబ్బులు పోగొట్టుకోవడం అనేది లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉందని తెలిపే ఒక సూచన. ఉదయం పూట డబ్బులు పోయా అంటే ఏదో ఒక రూపంలో మనకి అంతకు రెట్టింపు డబ్బులు వస్తాయని అర్థం. అంతేకాకుండా అప్పుడప్పుడు రోడ్డుమీద నడుచుకొని వెళ్లే సమయంలో మనకు డబ్బు దొరుకుతూ ఉంటుంది. ఇలా డబ్బు దొరికినా కూడా లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉందని అర్థం.
అలాగే కొన్ని సందర్భాలలో మనం వేరొకరికి డబ్బులు ఇచ్చేటప్పుడు పొరపాటున చేజారి డబ్బులు కింద పడిపోతాయి. ఇలా పొరపాటున చేజారి డబ్బులు పడిపోవటం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని తెలిపే ఒక సూచన. ఇలా జరగటం వల్ల డబ్బులు ఇచ్చే వ్యక్తికి తీసుకునే వ్యక్తికి కూడా మంచి జరుగుతుందని అర్థం. అయితే చాలామంది కావాలని డబ్బులు పడేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఇలా డబ్బు విసరటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మన వద్ద ఉన్న సంపద మొత్తం కరిగిపోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అందువల్ల పొరపాటున కూడా డబ్బును ఎప్పుడు విసరకూడదు. ఇలా చేయడం ఆ లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అర్థం.