శరత్కాలంలో తప్పక ఈ కవచం పారాయణం చేయండి !

అమ్మవారు..సాక్షాత్తు జగజ్జననీ. ఆదిశక్తి. ఆమ్మఅనేక రూపాలలో విశ్వాన్ని రక్షిస్తుంది. అమ్మవారి అనేక రూపాలను శ్రీలలితా సహస్రనమాలలో వశిన్యాది దేవతలు పేర్కొన్నారు. అందులో వారాహీ దేవత ఒక రూపం. ఆ తల్లి కవచాన్ని చదివితే అందులో ఆశ్వీయుజమాసం అంటే శరత్కాలం, అందులో అధికమాసం మరింత విశేషం. ఆ స్తోత్రం….

kavacham parayanam must do in sarathkalam
kavacham parayanam must do in sarathkalam

శ్రీ వారాహీ దేవి కవచం
అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II 1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II 3
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ II 4
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీII 5
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా II 6
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి II 7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా II 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో II 9
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. II 10
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. II 11
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. II 12
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. II 13
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. II 14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. II 15
ఈ కవచాన్ని ఎవరైతే తప్పలు లేకుండా శుచితో పారాయణం చేస్తారో వారికి గ్రహదోషాలు, శత్రుపీడలతో పాటు అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల శుభాలు కలుగుతాయి.