అట్లుంటదిమరి పవన్ – బాబు బంధం… తెరపైకి దత్త అవగాహన!

ఎవరు అవునన్నా కాదన్నా… చంద్రబాబు – పవన్ కల్యాన్ లది తండ్రీ కొడుకుల బంధం అని అంటుంటారు వైసీపీ నేతలు. చంద్రబాబుకి పవన్ దత్తపుత్రుడు అని అంటారు.. పవన్ కి చంద్రబాబు దత్తతండ్రి అని చెబుతుంటారు. ఆ రిలేషన్ సంగతి కాసేపు పక్కనపెడితే… వీరిమధ్య అండర్ స్టాండింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని అంటూ.. అందుకు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు పరిశీలకులులు.

అవును… పైకి అధికారికంగా పొత్తులో లేనప్పటికీ చాలా అండర్ స్టాండింగ్ లోనే పవన్ – చంద్రబాబులు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అలాఏమీ కాదు.. చంరబాబు చెప్పినట్లు పవన్ పనిచేస్తాడు అంతే.. అదంతా ప్యాకేజీ మహిమ అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కారణం ఏమైనప్పటికీ… వీళ్లిద్దరిమద్య ఉన్నటువంటి అండర్ స్టాండింగ్ మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా… పవన్ కి ఏమైనా అయితే చంద్రబాబు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే బాబు విషయంలో పవన్ కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. వీలైనే నేరుగా వెళ్లి పరామర్శిస్తున్నారు. అలాకానిపక్షంలో ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు.

బ్రో సినిమా విషయంలో మంత్రి అంబటి రాంబాబు.. పవన్ని టార్గెట్ చేస్తే చంద్రబాబు దాని మీద కౌంటర్ ఇచ్చారు. మంత్రి బ్రో సినిమా పంచాయతీలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఇక పుంగనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణ జరిగితే.. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అని ఒక ఘాటు ప్రకటనను పవన్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

ఇక వాలంటీర్ల విషయంలో పవన్ అవాకులూ చెవాకులూ పేలారు. దీంతో ఏపీ ప్రజానికం గరిష్టంగా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. అదే సమయంలో చంద్రబాబు కూడా వాలంటీర్లపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో… పవన్ వారాహి యాత్ర ఏపీలో సాగుతున్నపుడు చంద్రబాబు మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసుకే పరీతమవుతుంటారు. పార్టీ నాయైకులతో సమీక్షలు సమావేశాలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తారు.

ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా టూర్లలో బిజీగా ఉంటే…. పవన్ సినిమా షూటింగ్స్ లేకపోతే మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో ఉంటూ సమీక్షలు పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతూ ఉంటారు. అంతేతప్ప ఇద్దరూ మాత్ర ఒకసారి జనాల్లోకి రారు. స్థానిక నేతలకు జనసమీకరణంలో ఇబ్బందు తెచ్చిపెట్టరు.

ఇదే క్రమంలో తాజాగా… అంటే ఆగస్ట్ 1 నుంచి 10 వరకూ చంద్రబాబు ఏపీలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఏపీలోని జిల్లాలలో టూర్లు చేస్తున్నారు. 10వ తేదీతో చంద్రబాబు జిల్లా టూర్లు ఆగిపోతే అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ విశాఖలో వారాహి రధమెక్కి జనాల్లోకి వస్తున్నారు. ఆ యాత్ర ఈ నెల 19 వరకూ కొనసాగనుంది. దీంతో… ఈ పదిరోజులూ చంద్రబాబు టూర్లు ఉండవని ఈ ఇద్దరి రాజకీయాల మీద అవగాహన ఉన్నవారు అవ క్లారిటీకి వచ్చేస్తున్నారు.

దీంతో వీరిద్దరి మధ్యా ఉన్నదీ మామూలు అండర్ స్టాండింగ్ కాదని కొంతమంది అంటుంటే… వీరిది ప్యాకేజీ బందం అని ఇంకొకరు అంటుంటే… మరికొంతమంది మాత్రం దత్త బంధం అంటూ సెటైర్స్ వేస్తున్నారు.