తిరుమలలో కేవలం శ్రీవారి పూజలే కాకుండా.. అన్ని రకాల దేవతామూర్తుల కార్యక్రమాలను చేస్తున్నారు. దీనిలో బాగంగా లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. టీటీడీ భగవత్ సంకల్పంతో తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రధానాంశాలు..
– సనాతనధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యత ను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు ప్రతి రోజు టీటీడీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకునేలా ప్రసారం చేయాలి.
– కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫలితాలు, ఇందుకు సంబంధించిన ప్రవచనాలు, వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలి.
— కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన మహోత్సవం, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్వీబీసీ అధికారులకుఆదేశం