సాధారణంగా దిష్టి తగలకుండా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాలు కడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం పిల్లలు పెద్దలు అందరూ కూడా నలుపు రంగు దారాలు మెడలో, చేతికి, కాలికి కట్టుకుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలా నలుపు రంగు దారాలు దుస్తులు ధరించడం వల్ల ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇలా నలుపు రంగు దారాలు ధరించటం వల్ల శని దేవుడి దృష్టి మనపై పడకుండా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ నలుపు రంగు దారాలు ధరించటం వల్ల దిష్టి తగలడమే కాకుండా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శనీశ్వరుడికి ఇష్టమైన నలుపు రంగు ధరించటం వల్ల మన జాతకంలో శని బలంగా మారి ఆ శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. శని దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కూడా నల్ల దారంను కట్టుకోవాలి.
అయితే నలుపు రంగు దారం కుడి కాలికి కట్టుకోవటం వల్ల శని ప్రభావం తగ్గటమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. నలుపు రంగు దారం ధరించాలనుకునేవారు కేవలం మంగళ శనివారాలలో మాత్రమే నలుపు రంగు దారాలను ధరించాలి. అయితే అన్ని రాశుల వారు ఇలా నలుపు రంగు దారాలు, దుస్తులు ధరించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు నలుపు రంగు దుస్తులు దారాల ధరించటం వల్ల అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉంటుంది. ఏ ఏ రాశుల వారు ఈ నలుపు రంగు దారాలను ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం..వృశ్చికం, మేష రాశి వారు నల్ల దారం కట్టుకోవద్దని తీవ్ర సమస్యలు ఎదుర్కొని ప్రమాదం ఉంటుంది. నల్ల దారం ధరించడం వల్ల ఈ రాశుల వారు మానసిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో తరపు సతమతమవుతూ ఉంటారు. వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. అంగారకుడి ఎరుపురంగు అంటే ఇష్టం. అందువల్ల ఈ రాశి లో జన్మించిన వారు ఎరుపు రంగు ధరించాలి. ఈ రాశుల వారు నల్ల దారాన్ని ధరించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.