ఆదివారం ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. సంపద శ్రేయస్సు మన వెంటే?

హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే ఆరోజు ఏ దేవుడికి ప్రీతికరమైనదో తెలుసుకొని ఆ దేవుడిని పూజించడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని భావిస్తారు.అయితే చాలామంది ఆదివారం అంటే ఎలాంటి పూజలకు తావు లేకుండా కేవలం ఇంట్లో వారికి నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడానికి మాత్రమే సమయం కేటాయిస్తారు.ఆదివారం ఏదైనా శుభకార్యాలకు కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలకు సూర్యభగవానుడు రాజు అని పిలుస్తారు. అందుకే సూర్య దేవుని అనుగ్రహం మనపై ఉంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితం మొత్తం సుఖసంతోషాలతో ఉంటుందని చెప్పాలి. ఇలా సూర్యుని అనుగ్రహం మనపై ఉండాలంటే తప్పనిసరిగా ఆదివారం ఈ పరిహారాలు పాటిస్తూ సూర్యభగవానుడిని నమస్కరించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి.

ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు, ఖచ్చితంగా ‘ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః’ అనే మంత్రాన్ని చదువుకోవాలి.అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా నెయ్యి దీపం వెలిగించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం మనపై ఉండటమే కాకుండా లక్ష్మీదేవి కూడా మనకు సకల సంపదలను కలిగిస్తుంది. అదేవిధంగా ఆదివారం వస్త్ర దానం బెల్లం పాలు వంటి వాటిని దానం చేయడం ఎంతో మంచిది.ఇక ఆదివారం ప్రవహించే నీటిలో బెల్లం బియ్యం కలపడం ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు. ఇలా ఆదివారం ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.