సాధారణంగా పూజ చేసే సమయంలో పసుపు కుంకుమలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం పూజ చేసే సమయంలోను లేదా ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో పొరపాటున పసుపు కుంకుమ నేలపై పడితే చాలామంది అరిష్టమని భావిస్తారు.ఏదో చెడు జరగబోతుందని అందుకే ఇలా పసుపు కుంకుమ నేలపై పడ్డాయని చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ విధంగా శుభకార్యాలలోనూ ఇతర రోజులలో నేలపై పసుపు కుంకుమ పడటం నిజంగానే అరిష్టమా.. లేక ఇలా పడటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలోను లేదా పూజ చేసే సమయంలో మన ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే వారికి పసుపు కుంకుమ పువ్వులను అందిస్తాము.ఇలా ముత్తైదువకు పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల మన పసుపు కుంకములు పది కాలాలపాటు చల్లగా ఉంటాయని భావిస్తారు.ఈ క్రమంలోనే ఏదైనా శుభకార్యం చేసే సమయంలో కూడా పసుపు కుంకుమ నేలపై పడటం వల్ల ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు అది శుభసంకేతం.
భూమాత కూడా ఆ కార్యానికి హాజరవుతూ తనకు కూడా పసుపు కుంకుమ కావాలన్న ఉద్దేశంతోనే శుభకార్యాల సమయంలో మన చేతి నుంచి పొరపాటున పసుపు కుంకుమ కింద పడుతూ భూదేవిని కూడా ఆహ్వానించినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు.ఇలా మనం చేసే శుభకార్యాలలో పసుపు కుంకుమ కింద పడితే భూమాత ఆశీర్వాదాలు కూడా మనపై ఉంటాయని, ఇలా కిందపడినప్పుడు ఎలాంటి ఆశుభం జరగదని పండితులు చెబుతున్నారు.