ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే సరి..?

హిందూ సనాతన ధర్మంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యతగా ఉంది. దేశంలోనే ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలా ఇష్టదైవానికి పూజలు చేయడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రజలందరూ బ్రహ్మ ముహూర్తంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసి ఆ శివుడి ముందు దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం.

కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం వేళల్లో ఇంటి ప్రధాన ద్వారం ముందు దీపాలు వెలిగిస్తారు. ప్రత్యేకంగా ఈ కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4:30 నుండి 6 గంటల సమయంలో తలంటు స్నానం చేసి నియమం నిష్ఠలతో పూజ చేసి దీపాలు వెలిగించడం వల్ల ఏడాది మొత్తం పూజ చేసిన ఫలితం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తం పూజలకు దోషం. ఈ సమయం చాలా పవిత్రమైనది. అందువల్ల ప్రజలందరూ బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసి వారి కోరికలు తీరాలని ఇష్టదైవాన్ని వేడుకుంటారు. చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా రూపాయి మిగలక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు కార్తీకమాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తలంటు స్నానం చేసి ఆ శివుడి ముందు దీపాలు వెలిగించటం వల్ల పుణ్యం లభించడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసి దీపాలు తొలగించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. దీంతో ఇతర సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తి ప్రభావం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ అన్యోన్యంగా ఉంటారు.