కుబేర యంత్రాన్ని ఇలా పూజిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం..?

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. స్త్రీలు పురుషులు అని తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించినప్పటికీ.. నిత్యవసర వస్తువులు ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదించినా కూడా వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతో అనేక ఆర్థిక సమస్యలు. ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఇతరుల వద్ద అప్పులు చేస్తూ వాటిని తిరిగి చెల్లించటానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి హిందూ పురాణాలలో ఒక చక్కటి పరిష్కారం ఉంది.

హిందూ పురాణాల ప్రకారం కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ కుబేర యంత్రాన్ని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కుబేర యంత్రాన్ని కొని ఒక శుభ్రమైన పసుపు గుడ్డలో చుట్టి ఒక పాత్రలో ఉంచి పూజ గదిలో పెట్టాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ఒక చిన్న కుండను తీసుకొని ఆ కుండను గంగాజలం పచ్చిపాలతో నింపాలి. ఆ తర్వాత ఒక ఆసనాన్ని ఉంచి కుబేర యంత్రం ఉంచిన పాత్రను ఆ ఆసనం పై పెట్టాలి. ఆ తర్వాత పచ్చిపాలు గంగాజలం కలిపిన నీటితో ఆ కుబేర యంత్రానికి అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత ఆ కుబేర యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలి.

కుబేర యంత్రాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత, ‘ఓం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ: నమః’ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి. ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ సంపదకు అధిపతి అయిన కుబేరున్ని స్మరిస్తూ ఉండాలి. బంగారం, రాగి, అష్ట దాతులతో తయారుచేసిన కుబేర యంత్రాన్ని పూజించటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇలా పూజ గదిలో తూర్పు వైపున కుబేర యంత్రాన్ని ప్రతిష్టించి ప్రతిరోజు పూజించాలి. ఇలా ప్రతిరోజు కుబేర యంత్రానికి నియమనిష్టలతో పూజలు చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. అయితే పొరపాటున కూడా ఈ కుబేర యంత్రాన్ని అని మెడలో ధరించకూడదు.