సాధారణంగా మనం చెక్కరతో ఎన్నో రకాల తీపి వంటకాలను తయారు చేసుకుంటాం. మన జీవితంలో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేసేముందు ఆ కార్యక్రమం మంచిగా జరగాలని ఇలా మన జీవితం మొత్తం ఎంతో తీపిగా ఉండాలని భావిస్తూ చెక్కరతో ఎన్నో రకాల పదార్థాలను చేసుకుంటాము. అయితే కొంతమంది జాతకంలో కొన్ని రకాల జాతక దోషాలతో బాధపడుతూ ఉంటారు.ఇలా కొన్ని రకాల దోషాలతో బాధపడేవారు చక్కెరతో ఈ చిట్కాలను పాటిస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఎవరైతే పితృ దోషాలతో బాధపడుతుంటారో అలాంటివారు గోధుమ పిండిలోకి చక్కెర కలిపి చపాతీలను తయారుచేసి ఆ చపాతీలను కాకులకు పెట్టడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ఎవరికైతే పితృ దోషం ఉంటుందో అలాంటి వారికి సంతానం ఆలస్యంగా కలగడం, కుటుంబంలో కలహాలు బాధలు తలెత్తుతూ ఉంటాయి. ఇలా బాధపడేవారు. గోధుమ పిండిలో చక్కెర కలిపి చపాతీలు చేయడం వల్ల ఈ దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే రాహు గ్రహదోషంతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి ఎర్రని వస్త్రంలో కాస్త చక్కెర మూట కట్టి దిండు కింద పెట్టుకొని నిద్ర పోవాలి ఇలా చేయడం వల్ల రాహు గ్రహ దోషం తొలగిపోతుంది.
ఇక ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెరుగులో కాస్త చెక్కర కలుపుకొని తినడం వల్ల ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. అలాగే రాగి చెంబులో నీటిని వేసి చెక్కర కలిపి ఆ నీటిని తాగడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక శని ప్రభావంతో బాధపడే వారు శనివారం చీమలకు కాస్త చక్కెర కొబ్బరి పొడి కలిపి ఆహారంగా వేయటం వల్ల శనీశ్వరుడు సంతోషించి శని ప్రభావ దోషం తొలగిస్తారు. ఇలా చక్కెరతో ఈ చిట్కాలు,పరిహారాలు పాటించడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా గడుపుతారు.