సంధ్యా సమయంలో ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది?

రోజు రోజుకి దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న కూడా వాస్తు శాస్త్రానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. పురాతన కాలం నుండి ఈ వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం చేసే ప్రతి పనిని వాస్తు శాస్త్రం ప్రకారం చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇల్లు, కార్యాలయాలు నిర్మించే దగ్గర నుండి ఇంట్లో ఉన్న వస్తువులు అమర్చుకునే వరకు వాస్తు శాస్త్రం ప్రకారం చేయటం వల్ల ఎన్నో సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సాయంత్రం సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.

వాస్తు శాస్త్ర నిపుణులు సూచించిన విధంగా సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేయకుండా ఉండాలి. సంధ్యా సమయం తర్వాత మనం ఇంట్లో కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం పొంది ఇంటి నుండి వెళ్లిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. సంధ్యా సమయం తర్వాత చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• సంధ్య సమయం తర్వాత పొరపాటున కూడా ఇల్లు శుభ్రం చేయకూడదు. అలాగే మహిళలు సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఉంచాలి. మహిళలు సంధ్యా సమయానికి ముందే శుభ్రంగా తయారయ్యి దేవుడి గదిలో దీపం వెలిగించాలి.

• సంధ్యా సమయంలో ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇంటి ముఖ ద్వారాలు మూసి వేయకూడదు. సంధ్యా సమయంలో ఇంటికలుపులు మూసి వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది.

• సన్యాసమయంలో ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు కాదనకుండా సహాయం చేయాలి. పొరపాటున కూడా సంధ్యా సమయంలో ఎవరికి ఉప్పు దానం చేయరాదు. ఇలా ఉప్పు దానం చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

• సంధ్యా సమయంలో ఇంటిలో ఎప్పుడు గొడవ పడరాదు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఆ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది.

• అలాగే సన్యాసమయంలో తులసీమాతను పూజించిన తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులు తెంపరాదు. సంధ్యా సమయం తర్వాత తులసిమాతను తాకటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటికి దూరమవుతుంది.