సాధారణంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలలో వాస్తును కోట్లాదిమంది విశ్వసిస్తారు. అసలు వాస్తు పరిశీలిస్తే దీనివెనుక అనేక రహస్యాలు, మంచి ఉందని అర్థమవుతుంది.అయితే శాస్త్రం చదవకుండా పిచ్చిపిచ్చి ప్రయోగాలతో కొందరు చెప్పే వాస్తువల్ల అనుమానాలు, అపప్రదలు వస్తున్నాయి. అయితే వాస్తుదోషాలు శాంతించాలన్నా, వాటి నుంచి ఉపశమనం పొందడానికి పెద్దలు ఇంట్లో తప్పనిసరిగా పెంచాల్సిన చెట్లు కొన్ని ఈరోజు తెలుసుకుందాం.. తులసి- ఈ మొక్కలను తప్పనిసరిగా పెంచండి.
అయితే వీటిని చిన్న చిన్న కుండీల్లో కాకుండా… కాస్త పెద్ద కుండీల్లో పెంచడండి. లేదంటే అవి త్వరగా ఎండిపోతాయి. తులసి మొక్క వేరు విస్తరించాలి. అప్పుడే అది ఆరోగ్యకరంగా పెరుగుతుంది. రోజుకు రెండు సార్లు నీరు పోయండి. తులసి చెట్టు ఇంటి వాతావరణాన్ని శుధ్ది చేస్తుంది. సూక్ష్మ క్రిముల బరి నుంచి ఇంటిని దూరంగా ఉంచుతుంది. తులసి చెట్టును ఎప్పుడూ తూర్పు వైపు మాత్రమే ఉంచండి. ఇక రెండోచెట్టు బ్రహ్మీ ప్రతీ ఇంట్లో బ్రహ్మీ చెట్టు ఉండాలి అని పూర్వీకులు నమ్మేవారు.
trees inదీనికి తులసి చెట్టుకు పోసేంత నీరు కూడా అవసరం లేదు. మాససిక ఆరోగ్యం కోసం బ్రహ్మీ చెట్టు చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతికూల ఆలోచనలు అంటే నెగెటివ్ ఆలోచనలను నిర్మూలిస్తుంది. పిల్లల్లో హైపర్ టెన్షన్ ను దూరం చేస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. దాంతో పాటు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. బ్రహ్మీ చెట్టుతో మీరు డికాషన్ కూడా చేసుకోవచ్చు. వీటితోపాటు పెరడు ఉంటే మారేడు, పారిజాతం వంటి దేవతా వృక్షాలను పెంచుకోవచ్చు.