మన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలో రోజురోజుకీ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన కూడా ప్రజలకు వాస్తు శాస్త్రం మీద చాలా నమ్మకం ఉంది. సానుకూల ప్రతికూల శక్తులన్నీ వాస్తు శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో ఇల్లు నిర్మించే దగ్గర నుండి ఇంట్లో వస్తువులు అమర్చుకునే వరకు ప్రతి విషయాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం చేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రాన్ని పాటించకపోవడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడి అనేక సమస్యలకు దారితీస్తాయి. ఇలా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు శాస్త్రం ద్వారా పరిష్కారం పొందవచ్చు.
ఆర్థిక సమస్యల పరిష్కారానికి వాస్తు శాస్త్రం :
సాధారణంగా ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మించాలి. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి దిశలో మరుగుదొడ్డి నిర్మించినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తాండవిస్తాయి. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నైరుతి దిశలో ఉన్న మరుగుదొడ్డిని తొలగించాలి.
అలాగే ఇంట్లో లేదా దుకాణంలో ఈశాన్య దిశలో ఒక గాజు అమర్చటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా ఈశాన్య దిశలో గాజు ని అమర్చడం వల్ల రుణాల నుండి విముక్తి పొందటమే కాకుండా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ఈ గాజు ఎరుపు రంగులో ఉండకుండా జాగ్రత్త పడాలి.
అలాగే కొన్ని సందర్భాలలో ఇంటి ముఖద్వారం వద్ద ఒక చిన్న తలపు ఉంచటం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఎవరి వద్దన్నా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పుకు వాయిదాను మంగళవారం రోజున మాత్రమే చెల్లించాలి. ఇలా చేయడం వల్ల రుణం తొందరగా తిరిపోవడమే కాకుండా మళ్లీ అప్పు చేసే అవసరం ఏర్పడదు.