దీపావళి రోజు దీపాలు వెలిగించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఇకపోతే దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి వస్తే దీపావళి పండుగ రోజునరకాసుర సంహరణ జరగడం వల్ల ప్రజలందరూ రాక్షసునీ వద ఒదిలిపోయినందుకు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.అదేవిధంగా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమిపైకి రావటంతో ఎంతోమంది అమ్మవారికి దీపపు వెలుగులతో స్వాగతం పలకడం కోసం దీపావళి పండుగను జరుపుకుంటారు.

ఇక పురాణాల ప్రకారం రావణాసురుడి సంహరణం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు సతీసమేతంగా తిరిగి అయోధ్యకు చేరుకోవటం వల్ల ప్రజలందరూ సంతోషంతో శ్రీరామచంద్రుడికి దీపపు వెలుగులతో స్వాగతం పలకడంతో అప్పటినుంచి ఈ పండుగను దీపపు వెలుగుల నడుమ జరుపుకుంటారు.ఇక దీపాన్ని వెలిగించి మనలో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని తొలగించి సంపూర్ణమైన జ్ఞానం పొందడం కోసమే దీపావళి పండుగను జరుపుకుంటారు.

ఇక ఎంతో ముఖ్యమైన ఈ పండుగను జరుపుకునే సమయంలో పొరపాటున కూడా చిన్న తప్పులు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా దీపాలు వెలిగించే సమయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం.సాధారణంగా దీపాలను వెలిగించడం కోసం చాలామంది ఇత్తడి కంచు దీపాలను ఉపయోగిస్తారు. అయితే దీపావళి పండుగ రోజు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా దీపంలో ఆకర్షణ కోసం ఎన్నో ఒత్తులను వేసి వెలిగిస్తుంటారు. అయితే పొరపాటున కూడా అలా చేయకూడదు కేవలం రెండు లేదామూడు వత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసే దీపం వెలిగించాలి. ఇక దీపాలు వెలిగిస్తున్న సమయంలో ఈ మంత్రం తప్పకుండా పటించాలి..దీపం సర్వతమోపహం దీపో హరతుమే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే..అంటూ దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.