సాధారణంగా భక్తులు తరుచుగా గుడికి వెళ్తుంటారు. గుడిలో ధ్వజస్తంభం దగ్గర నుంచి గుడివెనుకగా ప్రదక్షణం చేస్తారు. అయితే ఆ సమయంలో గుడివెనుక చాలామంది మొక్కుకుంటుంటారు దీనివెనుక విశేషం తెలుసుకుందాం..గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాల యంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాల యంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచు తారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది. అదేవిధంగా శ్రీశైలంలో భ్రమరాంబిక దేవాలయం వెనుక భాగంలో ఝుం అనే నాదం వినిపిస్తుంది. దీన్ని భ్రమరీ నాదంగా భక్తులు భావిస్తారు. అలా గుడివెనుక అనేక రహస్యాలు దాగి ఉంటాయి.