మన హిందూ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయటం ఈ పండుగ ప్రత్యేకత. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయడంతో పాటు ఆ ముగ్గుల మీద ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టటం కూడా సంక్రాంతి పండుగ ప్రత్యేకత. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు.
ఈ మూడు రోజులపాటు ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. అయితే ఇలా గొబ్బెమ్మలు పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఉంది. యువతులు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని రంగురంగుల పువ్వులతో, కుంకుమ పసుపు బొట్లతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు. ఇలా గొబ్బెమ్మలు పెట్టడం గోపికా స్త్రీల రూపాలకు సంకేతంగా భావిస్తారు. గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. రంగుల ముగ్గు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజున యువతులను గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేస్తారు. కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తు బాలికలు ఇలా గొబ్బెమ్మలు చేస్తారు.
అయితే ఇలా గొబ్బెమ్మలు చేయటానికి శాస్త్రీయ పరంగా కూడా ప్రధానమైన కారణం ఉంది. సాధారణంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేస్తారు. ఇంటి ముందు లోగిళ్ళలో ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఇంట్లోకి సుష్మక్రియలు ప్రవేశించకుండా ఉంటాయని శాస్త్రపరంగా నిరూపణ అయింది. హిమమంతా చివరి రోజులు కాబట్టి సూక్ష్మ క్రిములు లో గాలిలో సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారుచేసి ఇంటి ముందు పెట్టడం వల్ల అవి ఆంటీబయాటిక్ గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందువల్లే భోగి పండుగ రోజు వేసే భోగి మంటలలో కూడా ఆవు పేడతో తయారుచేసిన పిడకలను వేస్తారు.