AP: 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నో హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ అంటూ 6 పథకాలను ప్రకటించారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అని చెప్పాలి. ఇక ఈ పథకం పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికీ అమలు అవుతున్నాయి అది కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి కేవలం 15 రోజులలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
ఇక తెలంగాణ కర్ణాటకలో ఈ పథకం మంచి వర్కౌట్ కావడంతో కూటమి పార్టీలు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు పూర్తి అవుతున్న ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేయటానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామంటూ మంత్రులు హడావిడి చేశారు కానీ అది కుదరలేదు ఇక జనవరి ఒకటో తేదీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని వార్తలు వచ్చాయి అది కూడా లేదని స్పష్టం అవుతుంది.
ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదని సమాచారం సంక్రాంతి పండుగ తర్వాత ఉగాది పండుగ అంటూ మరో కొత్త కథనాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పటివరకు మాత్రం కూటమి ప్రభుత్వ అధికారులు నేతలు మాత్రం ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో లేరని తెలుస్తుంది. కేవలం మహిళా ఓటర్లను ఆకర్షించడం కోసమే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చారని విమర్శలు కురిపిస్తున్నారు.