తమిళంలో గేమ్ చేంజర్ కి పోటీ లేనట్లే.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విధాముయార్చి!

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌కి తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత 30 సంవత్సరాలు అజిత్ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ ఘనవిజయం సాధించాయి. తాజాగా అజిత్ చేస్తున్న విదాముయార్చి చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అజిత్‌ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా, అర్జున్‌, రెజీనా కీలకపాత్ర పోషించారు. ఈ తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది.

ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి అజిత్‌ సినిమా వస్తోందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అనివార్య కారణాల వల్ల సినిమాని సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నామని, కొత్త తేదీని త్వరలోనే తెలియజేస్తామని చెప్పుకొచ్చారు మూవీ మేకర్స్ . ఈ ఏడాది సంక్రాంతికి త‌మిళంలో రానున్న ఒకే ఒక పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రం వాయిదా ప‌డ‌డంతో ఈ పండుగ‌కు అక్క‌డ పెద్ద సినిమా లేన‌ట్లే.

సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకోవటం వలన ముందుగా బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా గేమ్ ఛేంజరే. ఎందుకంటే తమిళ వెర్షన్ ని రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. సో అజిత్ కనక పోటీలో ఉంటే థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడా స్లాట్ ఖాళీ అయ్యింది కాబట్టి తగినన్ని స్క్రీన్లు దొరికే అవకాశాలు పెరిగాయి. పైగా ఎస్జె సూర్య, జయరాం, కియారా లాంటి క్యాస్టింగ్ కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది.

బాల దర్శకత్వం వహించిన ‘వనంగాన్’ రిలీజవుతున్నా దాని ప్రభావం GC వసూళ్లపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 2వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. కొత్త సంవత్సరం రోజు సందర్భంగా నేడు జనవరి 1న ఈ అప్‍డేట్ వెల్లడించింది మూవీ టీమ్. జనవరి 1నే ట్రైలర్ తెస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల చెప్పగా.. ఓ రోజు ఆలస్యంగా రావడం గమనార్హం.