సాధారణంగా మనం ఇంటి ముందు లేదా ఇంటి లోపల ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకోవడం జరుగుతుంది.ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటడం లేదా బొమ్మలను అలంకరించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తుతాయి అలా కాకుండా ఇష్టానుసారంగా వాస్తుకు విరుద్ధంగా మొక్కలు నాటడం ఇతర పనులు చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన గుమ్మం ముందు కొన్ని వస్తువులను పెట్టకపోవడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంటి ప్రధాన గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులను అసలు ఉంచకూడదు. ఇలా ఉంచారు అంటే ఇక ఆ ఇంట దరిద్ర దేవత తాండవం చేస్తుందని వారి ఆర్థిక ఎదుగుదల అంతటితో ఆగిపోతుందని అర్థం.
ఇక మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా చెత్త డబ్బాని పెట్టకూడదు ఇలా ఇంట్లో ఉన్నటువంటి చెత్త మొత్తం తీసుకొచ్చి ఆ డబ్బాలో వేస్తూ ఉంటాము. ఇలా చెత్త డబ్బా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉండటం వల్ల ఆ ఇంటి పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త డబ్బా అసలు ఉండకూడదు.అలాగే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు ఉండకుండా చూసుకోవాలి. ఇలా పెద్ద వృక్షాలు ఉండటం వల్ల బాల దోషాలు ఏర్పడతాయి ఇంట్లో చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి అందుకే ఇంటి ప్రదాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా పెద్ద వృక్షాలు ఉండకూడదు.అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉండడం వల్ల కూడా ఇంటిపై నెగటివ్ ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఇంట్లో స్త్రీలపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక చెప్పులను కూడా ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా అసలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.